Kashmir Deers: కశ్మీర్ వ్యాలీలో ఉండే అరుదైన వన్య ప్రాణిగా గుర్తింపు ఉన్న రెడ్ స్టాగ్ జింకలపై హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) పరిశోధన చేసింది. అయితే, జింకల జనాభా, జీవావరణం, సంతతిని పెంచే పలు అంశాలపై శాస్త్రీయంగా విశ్లేషించారు. కశ్మీర్ లోయలోని చీనాబ్ నదీ తీరంలో ఎక్కువగా ఈ జింకలు సంచరిస్తాయి.. వీటిపై సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అనురాధారెడ్డి నేతృత్వంలో పరిశోధన జరిపారు. జమ్ములోని దాచిగాం జాతీయ పార్కులో వీటిని సంరక్షిస్తున్నారు.. కాగా, 1990లో వీటి సంఖ్య 5 వేలుగా ఉండేదని వారు గుర్తించారు.
Read Also: Game Changer: ఒక షార్ట్ షెడ్యూల్ కి చరణ్ రెడీ…
అయితే, వీటి సంతాన ఉత్పత్తికి అవసరమైన మగ జింకల సంఖ్య మాత్రం కేవలం 12 లోపే ఉందని సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అనురాధారెడ్డి తేల్చారు. 14 మైక్రో శాటిలైట్ మేకర్ల ద్వారా 293 రెడ్ స్టాగ్ మల వ్యర్థాలను పరిశోధించి వాటి జన్యు క్రమాన్ని బట్టి ఎన్ని రెడ్ స్టాగ్ మగ జింకలు ఉన్నాయనేది వారు తేల్చారు. రుతుక్రమాలకు అనుగుణంగా వలస వెళ్లే ఈ జాతి జింకలు లోతట్టు, కొండ ప్రాంతాల్లోనే నివాసం ఉంటాయి.. ఇక, వీటిని ఇదే సమయంలో ఎక్కువగా సంతానోత్పత్తి చేస్తుంటాయని వారు పరిశోధనలో పేర్కొన్నారు. అయితే, వీటి సంపర్కం కూడా సెప్టెంబర్- నవంబర్ మధ్యలో ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. తమ పరిశోధన ద్వారా రెడ్ స్టాగ్ జింకల సంతానోత్పత్తిని పెంచడానికి వీలు పడుతుందన్నారు. ఈ జింకలు అంతరించిపోకుండా వాటిని కాపాడుకోవచ్చని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సైంటిస్టులు తెలిపారు. ఇక, సీసీఎంబీ సైంటిస్టులు చేసిన పరిశోధనలను కేంబ్రిడ్జి ప్రెస్ జర్నల్ ప్రచురించింది.