Site icon NTV Telugu

Ys Viveka Case: వైఎస్ వివేకా కేసులో సీబీఐ దూకుడు.. ఆ లెటర్ పై ఆరా

Cbi

Cbi

ఏపీ రాజకీయాలను కుదుపు కుదిపిన ఘటన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు..ఈ కేసుకి సంబంధించి రోజు రోజుకీ కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా వైయస్ వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వివేకా లెటర్ పై సిబిఐ విచారణ వేగవంతం చేసింది. నేడు సిబిఐ విచారణకు హాజరైన వివేక పిఎ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాష్ ద్వారా పలు విషయాలు సేకరించారు సీబీఐ అధికారులు. ఇద్దరిని కలిపి విచారిస్తున్నారు సిబిఐ అధికారులు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

Read Also: Bandi sanjay: అన్నదాతలు అల్లాడుతుంటే.. ఆయన ఢిల్లీకి పోవుడేంటి?

వివేకా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్. వైయస్ వివేక హత్య జరిగిన రోజు లెటర్ దాచి పెట్టడంపై ప్రకాష్ ను విచారిస్తుంది సిబిఐ… నిన్న పిఎ కృష్ణారెడ్డిని విచారించి వాంగ్మూలం నమోదు చేసుకుంది సిబిఐ…నేడు మరోసారి కృష్ణారెడ్డి వంట మనిషి కొడుకు ప్రకాష్ లను విచారిస్తుంది సిబిఐ.. పిఏ కృష్ణారెడ్డి ద్వారా లెటర్ ను దాచి పెట్టాడని ప్రకాష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ వివేకా లెటర్ పై కూపీ లాగుతుంది సిబిఐ.

Read Also: Chandrababu Naidu: రివర్స్ పాలనలో గేర్లు మార్చేస్తున్నారు

Exit mobile version