NTV Telugu Site icon

Rau’ IAS Study Circle : ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం.. రావు స్టడీ సర్కిల్ యజమాని పై ఎఫ్ఐఆర్

New Project (57)

New Project (57)

Rau’ IAS Study Circle : ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు రావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తాపై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. బిల్డింగ్ బేస్‌మెంట్‌లో నీరు నిలిచిపోవడంతో యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. కోచింగ్ సెంటర్ యజమానిపై మళ్లీ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన అనంతరం సీబీఐ బృందం బుధవారం రావు ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ భవనాన్ని సందర్శించి జూలై 27న ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ప్రాంతాన్ని పరిశీలించింది.

Read Also:TDP: నేడు టీడీపీ పొలిట్‌ బ్యూరో భేటీ.. మిషన్ -2029కు ప్రణాళికలు!

అభిషేక్ గుప్తాపై నేరపూరిత నరహత్య, నిర్లక్ష్యంతో మరణం, స్వచ్ఛందంగా గాయపరచడం, నిర్లక్ష్యపు ప్రవర్తన తదితర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. గత నెల జులై 27న ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలోని రావు కోచింగ్ సెంటర్ భవనం బేస్‌మెంట్‌లో నీరు నిలిచిపోవడంతో సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందడం గమనార్హం. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయా యాదవ్ (25), తెలంగాణకు చెందిన తాన్యా సోని (25), కేరళకు చెందిన నవీన్ డాల్విన్ ఉన్నారు. గుప్తాతో పాటు ఇతర నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థుల మృతితో రాజేంద్రనగర్‌లో కోచింగ్‌ చదువుతున్న విద్యార్థులు రెండ్రోజులుగా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు.

Read Also:Vinesh Phogat: వినేష్ ఫోగట్‌కు రివార్డు ప్రకటించిన హర్యానా ప్రభుత్వం..ఎంతంటే?

Show comments