Site icon NTV Telugu

Cat crossing : పిల్లి దారికి అడ్డొస్తే అపశకునమేనా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది!

Cat Crossing

Cat Crossing

Cat crossing : మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొస్తే చాలు.. వెంటనే అక్కడే ఆగిపోతాం. ఎవరో ఒకరు ఆ దారిలో వెళ్లే వరకు లేదా కాసేపు ఆగి నీళ్లు తాగి గానీ ముందుకు కదలం. పిల్లి దారి దాటడం అపశకునమని తరతరాలుగా వస్తున్న నమ్మకం. అయితే, పిల్లి ఎదురవ్వడం ప్రతిసారీ అశుభం కాదని, దాని దిశను బట్టి ఫలితాలు మారుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఆ దిశలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: 4 Dream Signs You Should Never Share: మీకు కలలో ఈ 4 సంకేతాలు కనిపించాయా?.. అవి రహస్యమే.. ఎవరికీ షేర్ చేయకండి..!

రాహు గ్రహంతో సంబంధం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పిల్లిని రాహు గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. రాహువు అకస్మాత్తుగా వచ్చే అడ్డంకులకు, గందరగోళానికి కారకుడు. అందుకే పిల్లి అడ్డు రావడం అనేది రాబోయే ఏదో ఒక ఆటంకానికి సంకేతంగా ‘నిమిత్త శాస్త్రం’ (శకున శాస్త్రం) చెబుతోంది. కానీ, అది వెళ్లే దిశను బట్టి శుభ, అశుభాలు ఆధారపడి ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, పిల్లి కుడి వైపు నుంచి ఎడమ వైపుకు దారి దాటితే అది శుభ సంకేతం అని అంటున్నారు. శకున శాస్త్రం ప్రకారం.. ఇలా జరిగితే మీరు వెళ్లే పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఈ స్థితిలో మీరు ఎక్కడో ఆగాల్సిన పని లేదని, ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చని చెబుతున్నారు.

ఎడమ నుంచి కుడికి వెళ్తే..
ఒకవేళ పిల్లి (ముఖ్యంగా నల్ల పిల్లి) మీ దారిని ఎడమ వైపు నుంచి కుడి వైపుకు దాటితే అది అశుభంగా పరిగణించాలని జ్యోతిష్యులు అంటున్నారు. ఇది రాబోయే ఆపదను లేదా పనిలో ఎదురయ్యే ఆటంకాలను సూచిస్తుందన్నారు. ఇలా జరిగినప్పుడు కొద్దిసేపు ఆగి, కాళ్లు చేతులు కడుక్కుని లేదా నీళ్లు తాగి వెళ్లడం మంచిదన్నారు. వీలైతే దగ్గరలోని గుడిని దర్శించుకోవడం లేదా తమలపాకు నమలడం ద్వారా దోషం తొలగుతుందని పండితులు చెబుతున్నారు. పిల్లి ఇంటి దగ్గర నిరంతరం ఏడుస్తుంటే అది ఏదో అశుభ వార్తకు లేదా అనారోగ్యానికి సంకేతమని నమ్ముతారు. ఒకవేళ పిల్లి మీ ఇంట్లో పిల్లలను పెడితే అది చాలా శుభప్రదం అని చెప్పారు. ఇది మీ ఇంట్లోకి ఐశ్వర్యం, అదృష్టం రాబోతున్నాయనడానికి సూచనగా పేర్కొన్నారు. ఈ నమ్మకాలు తరతరాలుగా వస్తున్నా, వీటిని కేవలం హెచ్చరిక సంకేతాలుగా మాత్రమే చూడాలని, గుడ్డిగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. మనశ్శాంతి కోసం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.

READ ALSO: Parthiban: తమిళ నటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం.. ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్ కోసం అప్లై!

Exit mobile version