Parthiban: తమిళ నటుడు పార్తిబన్ సంచలన నిర్ణయం.. ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికెట్ కోసం అప్లై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parthiban: తమిళ విలక్షణ నటుడు, దర్శకుడు పార్తిబన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో, దానికి ముగింపు పలకడమే కాకుండా ఒక విప్లవాత్మక అడుగు వేశారు. తనకి ఏ కులం, మతం లేదని చాటిచెప్పే ‘నో కాస్ట్ – నో రిలీజియన్ సర్టిఫికెట్’ కోసం ఆయన అధికారికంగా దరఖాస్తు చేసుకున్నారు.
READ ALSO: April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..
Also Read
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
అసలేం జరిగిందంటే..
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రంలో విలన్‌గా నటించిన పార్తిబన్, ఈ సినిమా ఈవెంట్‌లో తనను తాను పరిచయం చేసుకుంటూ తన సామాజిక వర్గం (కులం) పేరును ప్రస్తావించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మేధావిగా పేరున్న పార్తిబన్ కులం పేరు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. తాజా పరిణామాలపై శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన పార్తిబన్, ఆ వివాదంపై స్పష్టతనిచ్చారు. “నేను కులమతాలను అస్సలు పట్టించుకోను. వేదికపై నా మాతృభాష తెలుగు అని చెప్పబోయి, పొరపాటున సామాజిక వర్గం పేరును వాడాను. అది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు” అని వివరించారు. నెటిజన్ల విమర్శలు తనను ఎంతో బాధించాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కులం, మతం లేదని ధృవీకరించే సర్టిఫికెట్ తీసుకోవచ్చనే విషయం తనకు ఇప్పుడే తెలిసిందని, వెంటనే దానికి అప్లై చేశానని పార్తిబన్ వెల్లడించారు. “ఈ సర్టిఫికెట్ అందుకున్న తొలి సినీ నటుడిని నేనే అవుతాను. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించి, కులమతాలకు అతీతమైన సమాజం కోసం దీనిని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తాను” అని ఆయన ప్రకటించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!