Site icon NTV Telugu

Caste Census: ఏపీలో నేటి నుంచి కులగణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే..

Caste Census

Caste Census

Caste Census: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి కులగుణన ప్రారంభం కానుంది.. ఇప్పటికే ఏపీలో 6 జిల్లాల పరిధిలోని 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింది కులగణన విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో కులగణన చేపట్టనున్నారు.. దీంతో, ప్రతీ సచివాలయం పరిధిలోని ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి.. ప్రతీ ఒక్కరి వివరాలను సేకరించనున్నారు. ఈ రోజు ప్రారంభం కానున్న ఈ కులగణన ప్రక్రియ 10 రోజుల పాటు.. అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే, ఈ సమయంలో ఎవరైనా వివరాలు నమోదు చేయకపోతే.. ఆ తర్వాత కూడా అవకాశం కల్పించనున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో వివరాలు సేకరించాల్సి ఉండగా.. మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు.

Read Also: Tata Steel Layoffs : మూడు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న టాటా స్టీల్

సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో కులగణన ప్రక్రియ.. 10 రోజులపాటు కొనసాగనుంది. నేటి నుంచి 28 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నారు వాలంటీర్లు.. ఇళ్ల దగ్గర అందుబాటులో లేనివారికి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు సచివాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో సర్వేవివరాలు నమోదు చేస్తారు.. తలెత్తే సమస్యల సత్వర పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల వద్ద సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తారు. అయితే, మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇక, సిద్ధం చేసిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌లో దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా వర్గీకరించి అనుసంధానించారు.అయితే, గతంలో సేకరించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,23,40,422 కుటుంబాలు ఉండగా.. అందులో 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలు ఉండగా.. అందులో 1,33,16,091 మంది నివసిస్తున్నారు.

Exit mobile version