నిరుద్యోగులే వీరి టార్గెట్.. ఫేస్ బుక్‌లో నకిలీ ఫ్రొఫైల్స్‌ను సృష్టించి అబ్బాయిల నుంచి భారీ మొత్తంలో డబ్బులు లాగుతున్నారు. చాలా మంది యువకులు ఈ స్కామ్ లో చిక్కుకుపోయారు. ఈ స్కామ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు, పురుషులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ స్కామ్‌లో అందమైన మహిళల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అందులో వారు మూడు నెలల్లోపు వారిని గర్భవతిని చేసేవారికి రూ.20 లక్షల రివార్డు, ఆస్తి, కారు ఇస్తామంటూ చెబుతారు.
Nayanathara- Dhanush: నయనతారా మీరు చేసేదేమన్నా సమాజ సేవా? ఎందుకీ పైత్యం?
అంతేకాకుండా.. గర్భవతిని చేసే మగవాళ్లకు స్పెషల్ ఫీజులు కూడా ఇస్తామని పోస్ట్ చేస్తారు. ఈ పనిని గడువులోగా పూర్తి చేస్తే అధిక మొత్తంలో డబ్బు, ఆస్తులు ఇస్తామని ఆశ చూపుతారు. ఫేస్‌బుక్‌లో ఇలాంటి మోసపూరిత సందేశాలతో యువకులను ఆకర్షిస్తారు. ఆ తర్వాత డబ్బు చెల్లించి ఈ పని చేసేందుకు సిద్ధపడుతారు. ఈ స్కాంలో నేరస్థులు మొదట రిజిస్ట్రేషన్ ఫీజు (ప్రాసెసింగ్ ఫీజు) పేరుతో యువకుల నుండి డబ్బు వసూలు చేస్తారు. డబ్బు అకౌంట్‌లో చేరగానే.. వారితో కాంటాక్ట్ నిలిపివేస్తారు. ఆ తరువాత.. బాధితుడు మోసానికి గురవుతాడు. ఈ స్కాంతో తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడతాడు. ఇటీవల, హర్యానాకు చెందిన ఒక బాధితుడు మాట్లాడుతూ..”మోసగాళ్లు నన్ను వివిధ రకాల ఫీజుల పేరిట డబ్బులు అడిగారు. ప్రతిసారీ ఓ కొత్త అబద్ధం చెప్పేవాళ్లు.” అని అన్నాడు. ఈ కుంభకోణంలో రూ.లక్షకు పైగా నష్టపోయినట్లు బాధితుడు తెలిపాడు.
Minister Narayana: రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి..
ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించి మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ‘ప్రెగ్నెన్సీ జాబ్’ స్కామ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ఎనిమిది ఫేస్‌బుక్ గ్రూప్‌లను ఉపయోగించారు. ఈ గ్రూప్‌లలో మహిళల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తారు. ఈ మహిళలను ప్రెగ్నెన్సీ చేసిన మగవారికి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని చెబుతారు. కాగా.. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నారు. ఈ కేసులో బీహార్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. అయితే ఫేస్‌బుక్‌లో ఇటువంటి ఫేక్ మెస్సెజ్‌లు వస్తుండటంతో పెద్ద నెట్‌వర్క్ ఈ స్కాంను నడుపుతున్నట్లు గుర్తించారు.