Site icon NTV Telugu

PMF : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై కేసు నమోదు.. డైలమాలో రాజాసాబ్ రిలీజ్

Pmf

Pmf

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థపై కేసు నమోదయింది. తమను మోసం చేసారని పీపుల్ మీడియా ఫ్యాక్టరీఫై ముంబైకి చెందిన IVY ఎంటర్టైన్మెంట్స్ కేసు పెట్టింది. వివరాలలోకెళితే పీపుల్స్ మీడియా సంస్థ నిర్మాణంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజాసాబ్ అనే సినిమాను నిర్మిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ పై చాలా కాలంగా ఈ సినిమాను నిర్మిస్తోంది పీపుల్స్ మీడియా.

Also Read : Dhumketu : వార్ 2, కూలీని భయపెడుతున్న బెంగాలీ సినిమా

అయితే వందల కోట్ల బడ్జెట్ తో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాకు ముంబై కు చెందిన IVY ఎంటర్టైన్మెంట్స్ ఆర్థిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సినిమా షూటింగ్ కు అయ్యే ఖర్చు తదితర వాటికి ఆర్థిక వనరులు సమకూర్చేలా ఇరు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. గ్రాండ్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన పీపుల్ మీడియా మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను అనుకున్న టైమ్ లో ఫినిష్ చేయలేక పోయారు. ఇప్పటికే రాజాసాబ్ అనేకసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పీపుల్ మీడియా తమ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, సినిమా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయజేకుండా, తమకు ఎలాంటి  సమాచారం అందించడం లేదని, మేము ఇచ్చిన డబ్బులు ఎలా ఉపయోగించారనే దానిపై వివరణ కూడా వివరన ఇవ్వలేదని చెబుతూ ఢిల్లీ కోర్టులో కేసు నమోదు చేసింది. అలాగే మేము ఇచ్చిన డబ్బులో ప్రస్తుతం రూ. 218 కోట్లు తిరిగి ఇవ్వాలని IVY సంస్థ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా నాన్-థియేట్రికల్ డీల్‌ను క్లోజ్ కాలేదని, అనుకొని కారణాల వలన రిలీజ్ వాయిదా వేసామని కావాలని తమ పరువుకు భంగం కలిగింస్తున్నారని IVY ఎంటర్టైన్మెంట్స్ పై కోర్టును ఆశ్రయించింది పీపుల్స్ మీడియా.

Exit mobile version