Site icon NTV Telugu

YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు.. దేవతలను, మహిళలను కించపరిచారంటూ..!

Anvesh

Anvesh

YouTuber Anvesh: నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అన్వేష్ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Shreyas Iyer: టీమిండియా ఫాన్స్కు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్ సిరీస్‌కు స్టార్ బ్యాట్స్మెన్ దూరం..!

అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఖమ్మం అర్బన్ పోలీసులు వెల్లడించారు. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎటు నుండి ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావడంలేదు.

Shambala :’శంబాల’ సక్సెస్ మీట్‌లో.. ఆది సాయి కుమార్‌పై అల్లు అరవింద్ భారీ ప్రశంసలు

మరోవైపు యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దేవీ దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి. కళ్యాణి ఫిర్యాదుపై 352,79,299 BNS SEC 67IT యాక్ట్ ల కింద కేసు నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించి త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు.

Exit mobile version