NTV Telugu Site icon

Carrots : పచ్చి క్యారెట్ లను ఎక్కువగా తింటున్నారా? ఇది మీకోసమే..

Carrotss

Carrotss

క్యారెట్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు.. వీటిలో విటమిన్ ఎ పుష్కలంగ ఉంటుంది.. కళ్లకు చాలా మంచిదన వైద్యులు కూడా చెబుతుంటారు.. అయితే ఈరోజుల్లో జనాలు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిని కాకుండా నోటికి రుచిగా ఉండే వాటినే ఎక్కువగా తింటారు.. దాంతో లేనిపోని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అయితే పచ్చి క్యారెట్ లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ క్యారెట్స్ ఏడాది పొడవునా మార్కెట్ లో దొరుకుతాయి.. వీటిని భూమిలోంచి తీస్తారు కాబట్టి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయి.. ముఖ్యంగా చెప్పాలంటే థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో ఇది బెస్ట్ మెడిసిన్.. అలాగే ఉదయం పూట క్యారెట్ లను తినడం వల్ల చర్మం మెరుగ్గా ఉంటుంది.. క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ, బీటా కెరోటిన్ లాంటివి చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయట. అలాగే మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు..

స్త్రీలల్లో రుతుక్రమం సమస్యలను తగ్గిస్తుంది.. అలాగే పురుషులల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో క్యారెట్ సహాయపడుతుంది.. దంతాలు కూడా చాలా బలంగా తయారవుతాయట. ఇక జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుందని చెబుతున్నారు వైద్యులు… మలబద్ధకం సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ఎన్నో సమస్యలను తగ్గించడంలో క్యారెట్లు బేషుగ్గా పనిచేస్తాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments