Carrot Cake Recipe: ఇప్పటి వరకు ఎన్నో రకాల కేక్ లను చుసె ఉంటాము. అయితే వీటిలో కచ్చితంగా మైదా, గుడ్లను వాడి ఉంటారు. అయితే ఈ రెండు లేకున్నా హెల్తీ, ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతో సులభంగా చేసుకునే ‘క్యారెట్ కేక్’ ఎలా చూసేయాలో చూసేద్దాం. ఇందులో మైదా, ఎగ్, వైట్ షుగర్ తప్పనిసరి కాదు. ఓవెన్ లేకపోయినా స్టవ్ మీదే ఈ కేక్‌ను తయారు చేసుకోవచ్చు. కేవలం ఒక క్యారెట్‌తోనే మంచి సాఫ్ట్ కేక్ సిద్ధమవుతుంది. ఎలాగో చూసేద్దామా..
భద్రతకు ప్రాధాన్యం.. 5 Star Safety Rating కాంపాక్ట్ SUVలు లిస్ట్ ఇదిగో!
కావలసిన పదార్థాలు:
* గోధుమ పిండి – 1 కప్పు
* తురిమిన క్యారెట్ – 1 కప్పు
* బ్రౌన్ షుగర్ లేదా బెల్లం తురుము – ½ నుండి ¾ కప్పు
* పాలు – ¾ కప్పు
* నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
* నిమ్మరసం – 1 టీ స్పూన్
* యాలకుల పొడి – ½ టీ స్పూన్
* ఉప్పు – కావలిసినంత
* బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్
* బేకింగ్ సోడా – ¼ టీ స్పూన్
* మిల్క్ పౌడర్ (ఐచ్చికం) – 2 టేబుల్ స్పూన్లు
* నట్స్/టూటీ ఫ్రూటీ – అవసరానికి
తయారీ విధానం:
ముందుగా బ్రౌన్ షుగర్‌ను మిక్సీలో వేసి ఫైన్ పౌడర్‌గా గ్రైండ్ చేయాలి. ఆపై ఒక గిన్నెలో షుగర్ పౌడర్, పాలు, ఉప్పు, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత నిమ్మరసం వేసి మిశ్రమాన్ని మెల్లగా విస్క్ చేయాలి. ఇప్పుడు జల్లెడతో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్ కలపాలి. ఇవన్నీ నెమ్మదిగా కలుపుతూ.. పిండిని తాయారు చేసుకోవాలి. ఒకవేళ పిండి (బ్యాటెర్) చాలా గట్టిగా ఉంటే కొద్దిగా పాలు వేసి సరైన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. తరువాత తురిమిన క్యారెట్‌ను బ్యాటర్‌లో వేసి బాగా కలపాలి.
కొత్త డిజైన్, స్మూత్ యానిమేషన్లతో Android 17 Beta.. ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసా?
స్టవ్ మీద బేకింగ్ విధానం:
ఒక కడాయి లేదా పాన్ తీసుకుని అడుగున ఉప్పు వేసి స్టాండ్ పెట్టాలి. మూత పెట్టి సుమారు 10 నిమిషాలు ప్రీహీట్ (ముందుగానే వేడి) చేయాలి. ఇంతలో కేక్ టిన్‌కు నెయ్యి లేదా ఆయిల్ రాసి గోధుమ పిండి చల్లి లేదా బట్టర్ పేపర్ వేసి బ్యాటర్‌ను టిన్‌లో పోసి పైన నట్స్ లేదా టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. ప్రీహీట్ చేసిన పాన్‌లో కేక్ టిన్ పెట్టి మధ్యస్థ మంటపై 45–50 నిమిషాలు కుక్ చేయాలి. ఓవెన్‌లో చేయాలంటే 180°C వద్ద 40–45 నిమిషాలు బేక్ చేయాలి. అంతే మీ హెల్తీ ‘క్యారెట్ కేక్’ రెడీ.
కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి. దీనిని బయట ఉంచితే 3 రోజులు, ఫ్రిజ్‌లో ఉంటె 5–8 రోజులు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా సింపుల్‌గా ఇంట్లోనే హెల్తీ క్యారెట్ కేక్ తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రమే కాదు, పిల్లలకు కూడా పోషక ఫుడ్ గా ఉంటుంది.
