Site icon NTV Telugu

New Covid Variant: భారత్‎లోకి కొత్త కోవిడ్ వేరియంట్.. గుజరాత్‎లో మొదటికేసు

Bq.1 Variant

Bq.1 Variant

New Covid Variant: ప్రమాదకరమైన కోవిడ్ XBB.1.5 వేరియంట్ భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ వేరియంట్‌కు సంబంధించిన మొదటి కేసు గుజరాత్‌లో నమోదైంది. మునుపటి వేరియంట్ BQ.1 కంటే ఇది 120 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్‎ను నిపుణులు ఇటీవల అమెరికాలో కనుగొన్నారు. దీనిని సూపర్ వేరియంట్ గా పిలుస్తున్నారు. దీంతో దవాఖానాల్లోకి వచ్చే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. చైనీస్ మూలాలు కలిగిన అమెరికన్ ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగెల్డింగ్, ఇతర అన్ని రకాల కంటే వేగంగా మన రోగనిరోధక వ్యవస్థ నుండి తప్పించుకునే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడించారు.

Read Also: R Narayana Murthy: ఎన్నేళ్లు అయినా పీపుల్స్ స్టార్ ఒక్కడే ఉన్నాడు… ఒక్కడే ఉంటాడు…

ఈ కొత్త వేరియంట్‌ని గుర్తించిన 17 రోజుల్లోనే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. దీని R విలువ BQ.1 యొక్క R విలువ కంటే ఎక్కువగా ఉంది. BQ.1 కంటే 108 శాతం వేగంగా విస్తరిస్తోంది. దీని విస్తరణ క్రిస్మస్ ముందు ప్రారంభమైంది. ఇప్పుడు విస్తరణ రేటు 120 శాతంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. గత రెండు వారాల్లో ఈ కొత్త వేరియంట్‌కు గురైన వ్యక్తుల సంఖ్యను యూఎస్ సీడీసీ వెల్లడించలేదని ఎరిక్ చెప్పారు. చైనా మాదిరిగానే అమెరికా కూడా ఈ కొత్త వేరియంట్ డేటాను దాచిపెట్టిందని ఆరోపించారు. అతను కేవలం 40 శాతం విస్తరణ రేటు వాదనలను అబద్ధాలని కొట్టిపారేశాడు. XBB.1.5 వేరియంట్ అమెరికన్ నగరాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Mercedes Car: రిషబ్ పంత్ బతికున్నాడంటే “కారు” కూడా కారణమే.. ఆ కారు ప్రత్యేకతలివే..

ఈ XBB.1.5 వేరియంట్ అమెరికా నుంచి ఇతర దేశాలకు విస్తరించినట్లు నిపుణులు గుర్తించారు. సింగపూర్‌లో కనిపించే XBB.1.5 వేరియంట్ కంటే ఇది 96 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని వారు చెప్పారు. ఈ కొత్త వేరియంట్ అక్టోబర్లో న్యూయార్క్‌లో వ్యాప్తి చెందడం ప్రారంభించిందని ఎరిక్ స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను పోలి లేనందున ప్రభుత్వం దాని ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించలేకపోయిందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే పరివర్తన చెందిన రెండు కరోనా వేరియంట్‌లతో రూపొందించబడిన ఓమిక్రాన్‌లా కాకుండా ఇది ఒక ప్రత్యేక రీకాంబినేషన్ అని పరిశోధకులు గుర్తించారు.

Exit mobile version