Site icon NTV Telugu

Anupama Parameswaran: చివరికి నువ్వు కూడానా.. అనుపమ.. తట్టుకోలేకపోతున్నామే

Anupama

Anupama

Anupama Parameswaran: వరుస హిట్లతో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మంచి జోరు మీద ఉంది. కార్తికేయ 2, 18 పేజెస్ అమ్మడికి మంచి పేరునే తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు 2 లో నటిస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అంతకుముందు కొద్దిగా బొద్దుగా ఉన్న అనుపమ ఈ మధ్య బక్కచిక్కి కనిపిస్తున్న విషయం తెల్సిందే. అయితే గత కొన్నిరోజులుగా అనుపమ కూడా అందాల ఆరబోతను ఎంకరేజ్ చేస్తుందని మాటలు వినిపిస్తున్నాయి. పద్దతిగా, తెలుగు ఆడపడుచుల ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య అందాల ఆరబోతకు పూనుకొంది. మోడ్రన్ డ్రెస్ లలో ఎద అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది.

Sharma Sisters: విప్పి చూపించడమే.. ఏం లేదు అక్కడ

ఇక తాజాగా మరోసారి హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో ష్రగ్ తో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అబ్బా.. అనుపమ చివరికి నువ్వు కూడా ఇలాంటి ఫోటో షూట్స్ చేసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నావా..? తట్టుకోలేకుండా ఉన్నామే అని కొందరు.. అందాల ఆరబోతకు ఫస్ట్ స్టెప్.. ముందు ముందు మరిన్ని రాబోతున్నాయి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. వరుస హిట్లు అందుకుంటున్న అనుపమ.. ముందు ముందు ఎలాంటి సినిమాలకైనా సిద్దమే అని హింట్ ఇస్తుందా..? అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version