NTV Telugu Site icon

Captain Miller Teaser: ‘కెప్టెన్‌ మిల్లర్‌’ టీజర్‌ వచ్చేసింది.. ధనుష్‌ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోలా!

Captain Miller Teaser

Captain Miller Teaser

Captain Miller Movie Teaser Out on Hero Dhanush’s BirthDay: కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌ కథానాయకుడిగా, అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కెప్టెన్‌ మిల్లర్‌’. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తున్నారు. జి శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్‌ కిషన్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌, నాజర్, నివేదితా సతీశ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు (జులై 28) కెప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

పిరియాడిక్ మూవీగా తెరకెక్కుతున్న కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా టీజర్‌ని హీరో ధనుష్ పుట్టిన రోజు (Happy Birthday Dhanush) సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి 12.01 గంటలకు రిలీజ్ చేశారు. కేవలం 40 సెకన్లు నిడివి కలిగిన ఈ టీజర్‌లో ధనుష్ భారీ తుపాకీతో ప్రత్యర్ధులను అల్లాడించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన లూయిస్‌ మెషిన్‌ గన్‌ను ధనుష్‌ చేతిలో పట్టుకొని యుద్ధ భూమిలో కనిపించాడు. మరోవైపు గొడ్డలితో కూడా వీరవిహారం చేశాడు. టీజర్‌ మొత్తం యాక్షన్‌ ఎపిసోడ్‌తో నిండిపోయింది.

Also Read: Virat Kohli Catch: ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ పట్టిన విరాట్ కోహ్లీ.. సంభ్రమాశ్చర్యాలకు గురైన భారత ప్లేయర్స్!

హీరో ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాట చాలా చోట్ల థియేటర్లలో కెప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌ రిలీజ్ చేశారు. ధనుష్‌ అభిమానులు ఈ టీజర్‌ చూసి పండగ చేసుకున్నారు. సినిమా వేరే లెవల్లో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కన్నడ హీరో శివరాజ్‌ కుమార్ సైతం ధనుష్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కెప్టెన్ మిల్లర్ టీజర్‌ అద్భుతంగా ఉంటుందని చెప్పారు.

Also Read: Gold Today Price: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

కెప్టెన్‌ మిల్లర్‌ నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పుడు టీజర్‌ ఆ అంచనాలను మరింత పెంచింది. డిసెంబర్ 15న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ధనుష్‌ కెరీర్‌లోనే కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. దానికి తోడు పీరియాడిక్ నేపథ్యం, సర్ సినిమా అనంతరం వస్తుండడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి.

Show comments