MLA Lasya Nanditha: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఓఆర్‌ఆర్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వాహనం అదుపు తప్పి రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్ సమీపంలో ఎక్స్‌ఎల్6 రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొంది. మేడ్చల్ బయలుదేరే ప్రదేశం సుల్తాన్‌పూర్ ORR నిష్క్రమణకు సమీపంలో ఉంది. ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీసి పటాన్ చెరు అమేథా హాస్పిటల్ లో తరలించారు.
Read also: CM Revanth Reddy: నేడు మేడారంకు సీఎం.. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు
లాస్య తండ్రి సాయన్న మృతి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న గతేడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుమార్తెకు గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. అంతకు ముందు కార్పొరేటర్‌గా పనిచేశారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌లో హోరాహోరీగా సాగింది. కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గద్దర్ కుమార్ వెన్నెల పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన లాస్య నందిత విజయం సాధించారు.
Read also: Read also: CM Jagan: నేడు ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ..
వరుస ప్రమాదాలు..
లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వరుస ప్రమాదాలు జరిగాయి. డిసెంబరు 24న బోయిన్‌పల్లి వద్ద లిఫ్ట్‌లో చిక్కుకుపోయింది.బోయినపల్లిలోని వీఆర్ ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే లాస్య నందిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతుండగా ఎమ్మెల్యే లిఫ్ట్ ఇబ్బంది పడింది. చాలా మంది లిఫ్ట్‌లోకి వెళ్లడంతో కొద్దిసేపటికి లిఫ్ట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో లిఫ్ట్‌లో ఉన్న ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు పలువురు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది లిఫ్ట్ తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు మరికొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రెండో ప్రమాదం..
ఆ తర్వాత ఫిబ్రవరి 13న నల్గొండ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. బీఆర్‌ఎస్ బహిరంగ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్ వెళుతుండగా ఆమె వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాలను నియంత్రించే పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు.
మూడో సారి..
నల్గొండ రోడ్డు ప్రమాదం తర్వాత లాస్య నందిత కొత్త కారు కొన్నట్లు సమాచారం. నిన్న సదాశివ పేటలో ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు లాస్య.. ఆతరువాత ఇవాళ ఉదయం తన స్నేహితుడు ఆకాష్ తో కలిసి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమయంలో వెనుక సీటులో కూర్చున్న లాస్య నందిత తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. స్నేహితుడు ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిద్ర మత్తు, అతి వేగంగా కారును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.
PM Modi : వారణాసిలో ప్రధాని రోడ్ షో.. సీఎం యోగితో శివపూర్-లహర్తర రహదారి పరిశీలన