NTV Telugu Site icon

Allu Aravind : రామోజీరావును చివరి చూపు చూసుకోలేక పోతున్నా..

Alluaravind (1)

Alluaravind (1)

Allu Aravind : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నేడు అనారోగ్యంతో మరణించారు..గత కొంతకాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న రామోజీరావును ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది.దీనితో ఆయనను ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉంచారు.వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రస్తుతం ఆయన పార్థివ దేహం ఆయన నివాసానికి తరలించారు.ఆయనకు నివాళులు అర్పించేందుకు రాజకీయ ,సినీ ప్రముఖులు ,అభిమానులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు.

Read Also :Bellamkonda Srinivas : ఆ ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..?

ఇప్పటికే చిరంజీవి ,పవన్ కల్యాణ్ ,నాగార్జున తదితరులు రామోజీరావు నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు.తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రామోజీ రావు మృతికి సంతాపం తెలియజేస్తూ స్పెషల్ నోట్ ను విడుదల చేసారు. “రామోజీరావ్ గారంటే మనిషి కాదు వ్యవస్థ.నీతి నియమాలున్న సంస్థ..రైతన్నలకు అన్నదాత ..పత్రికా రంగంలో ప్రభంజన కర్త .మాలాంటి వారికి ఆయన మార్గదర్శి..గొప్ప చిత్రాలు ఉన్నతాదర్శాలతో తీసిన నిర్మాత ..స్వర్గానికి ఎగిసిన తెలుగు తేజం ఆయన అమరులు..నేను విదేశాల్లో ఉండగా ఈ దుర్వార్త రావడం విచారకరం.నాకు ఎన్నో విషయాలలో ఎంతో స్ఫూర్తి దాయకం వారి జీవితం..ఈరోజు నేను ఆయనకీ వీడ్కోలు చెప్పి కడసారిగా వారికీ నివాళులు అందించలేకపోవడం దురదృష్టకరం .వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని తెలియజేసారు.

Show comments