First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..

Six Ball

Six Ball

కెనడా సూపర్ 60 టోర్నమెంట్‌లో టొరంటో సిక్సర్స్, మిస్సిసావుగా మాస్టర్స్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అమెరికా పేసర్ అలీ ఖాన్ వేసిన ఒక బౌన్సర్ ఊహించని రీతిలో వికెట్ కీపర్, బ్యాటర్ అయిన కీరన్ పొలార్డ్ తలల మీదుగా ఎగిరి నేరుగా బౌండరీ లైన్ దాటి సిక్సర్‌గా వెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సాధారణంగా ఇలాంటి బంతులు కీపర్ వెనుక పడతాయి, కానీ ఈ బంతి మాత్రం ఎక్కడా టచ్ కాకుండా గాల్లోనే ఎగురుతూ బౌండరీ దాటింది.

ఈ విచిత్రమైన ఘటనకు వాంకోవర్‌లోని బిసి ప్లే స్టేడియంలో ఉన్న చిన్న మైదానమే ప్రధాన కారణం. ఇక్కడ బౌండరీలు దాదాపు 45 మీటర్ల చిన్న పరిమాణంలో ఉండటంతో, బంతి తక్కువ దూరం ప్రయాణించి బౌండరీని తాకగలిగింది. అయితే.. వైడ్ బంతి బౌండరీ దాటినప్పుడు ఏడు పరుగులు రావాలి కదా అనే సందేహం కలగడం సహజం. వైడ్ రూపంలో ఒక పరుగు, బౌండరీకి నాలుగు పరుగులు కలిపి మొత్తం ఐదు పరుగులు మాత్రమే రావడానికి క్రికెట్ నిబంధనలే కారణం.

ఎంసీసీ (MCC) లా 22 ప్రకారం.. వైడ్ బంతికి ఒక పెనాల్టీ రన్ లభిస్తుంది. అలాగే బ్యాట్ తాకకుండా వైడ్ బంతి బౌండరీ దాటితే అదనంగా నాలుగు పరుగుల బౌండరీ అలవెన్స్ ఇస్తారు. అయితే, బ్యాట్‌తో కొట్టకుండా గాల్లో నేరుగా బౌండరీ దాటినంత మాత్రాన దాన్ని ఆటోమేటిక్‌గా సిక్సర్‌గా పరిగణించరు. ఎంసీసీ లా 19 ప్రకారం.. బ్యాట్ తాకకుండా బౌండరీకి వెళ్లే ఏ బంతికైనా గరిష్టంగా నాలుగు పరుగులు మాత్రమే కేటాయిస్తారు. అందుకే ఈ అరుదైన బౌన్సర్‌కు బ్యాటింగ్ జట్టుకు ఏడు పరుగులు కాకుండా కేవలం ఐదు పరుగులు మాత్రమే లభించాయి.