Site icon NTV Telugu

King Cobra: కింగ్ కోబ్రా పాములు మనుషుల కంటే వేగంగా పరుగెత్తగలవా?

King Cobra Speed

King Cobra Speed

‘కింగ్ కోబ్రా’.. ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము. శాస్త్రీయంగా దీనిని ఓఫియోఫాగస్ హన్నా అని పిలుస్తారు. కింగ్ కోబ్రా సాధారణంగా 13 అడుగుల పొడవు ఉంటుంది. కొన్ని 18 అడుగుల వరకు కూడా పెరుగుతాయి. ఈ పాము పడగ విప్పితే భయంకరంగా కనిపిస్తుంది. మాములుగా ఇవి మనుషులను ఏమీ అనవు కానీ.. దానిని గెలికితే మాత్రం ఊరుకోవు. కింగ్ కోబ్రా ఎక్కువగా ఇండోనేషియా, భారతదేశంలో ఉంటాయి. అడవుల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి.

కింగ్ కోబ్రా విషపూరితమైనది మాత్రమే కాదు.. బాగా పాకగలదు (పరుగెత్తగలదు) కూడా. కింగ్ కోబ్రా మనుషుల కంటే వేగంగా పరుగెడుతుంది. సగటు పురుషుడి పరుగు వేగం గంటకు 8-12 కిలోమీటర్లు. ఇది ఆ వ్యక్తి ఫిట్‌నెస్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. మంచి ఫిట్‌నెస్ ఉన్న వ్యక్తి గంటకు 12-16 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలడు. కింగ్ కోబ్రా గంటకు 19 కిలోమీటర్ల వేగంతో పాకగలదు. అంటే కింగ్ కోబ్రా మనిషి కంటే వేగంగా పరిగెత్తుతుంది. అది ఒక్కసారి వెంబడించిందంటే మనిషిని కచ్చితంగా కాటేస్తుంది.

Also Read: Concussion: టీమిండియా పేసర్ తలకు గాయం.. మ్యాచ్ మధ్యలో నుంచే ఆస్పత్రికి!

కింగ్ కోబ్రా విషం అత్యంత ప్రమాదకరం. ఇది ఒక్కసారి కాటు వేస్తే.. బలమైన ఏనుగు కూడా నిమిషాల్లో చనిపోతుంది. ఇక మనిషి సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కింగ్ కోబ్రా విషం మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. విష ప్రభావంతో దేహమంతా తీవ్రమైన నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. ఆపై కొన్ని నిముషాలలోనే గుండెకు రక్త సరఫరా ఆగిపోయి మనిషి చనిపోతాడు.

Exit mobile version