హైదరాబాద్ పాతబస్తీలో మళ్లీ కత్తిపోట్లు కలకలం రేపుతున్నాయి. కొందరు యువకులు కలిసి ఇంటి ముందు క్యాంప్ ఫైర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పక్కనే ఉండే వారు తమకు అల్లర్లు, గోలలతో ఇబ్బందిగా ఉందని ప్రశ్నించారు. దీంతో.. యువకులకు, వారికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో.. మండుతున్న క్యాంప్ ఫైర్ లోని కట్టెలతో అబ్దుల్లా ఖాన్, వసిమ్ అనే యువకులపై సమీర్, జమిర్, సయ్యద్ అనే యువకులు దాడి చేశారు. వెంటనే.. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో.. ఇరువురు కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడి ఘటనలో అబ్దుల్లా ఖాన్, వసిమ్లకు గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గౌస్నగర్లో చోటు చేసుకుంది.
Hyderabad: ఇంటి ముందు క్యాంప్ ఫైర్.. ప్రశ్నించిన వారిపై కాలుతున్న కట్టెలతో..
- హైదరాబాద్ పాతబస్తీలో మళ్లీ కత్తిపోట్లు కలకలం
- కొందరు యువకులు ఇంటి ముందు క్యాంప్ ఫైర్
- పక్కింటి వారు ఏంటని ప్రశ్నించడంతో గొడవ
- మండుతున్న కట్టెలతో దాడి.. అనంతరం కత్తులతో దాడి

Camp Fire