Site icon NTV Telugu

GHMC: మీ వీధిలో కుక్కలు అధికంగా ఉన్నాయా? అయితే ఈ నంబరుకు ఫోన్ చేయండి..

Ghmc

Ghmc

నగరంలో కుక్కల బెదడ అధికమైంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. ప్రజలపై కుక్కల దాడులు అధికమయ్యాయి. ఆడుకునే పిల్లలు భయపడుతున్న ఘటనలు అనేకం. చికెన్, మటన్ సెంటర్లు, హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కలంగా ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది. నగరంలోని అన్ని వీధుల్లో వాటి బెదడ ఉంది. చిన్నపిల్లలపై దాడులు చేసిన చాలా ఘటనలు రోజూ బయటకు వస్తునే ఉన్నాయి.

READ MORE: Africa: ఆఫ్రికాలో బోటు బోల్తా.. 15 మంది మృతి.. డజన్ల కొద్దీ గల్లంతు

తాజాగా జరుగుతున్న ఘటనలపై జీహెచ్ఎంసీ స్పందించింది. ప్రజల విన్నపాలకు దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మీ ఏరియాలో కుక్కల బెడద ఉందా? టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి అంటూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయన్నారు. మరెందుకు ఆలస్యం.. జస్ట్ ఒక్క కాల్ చేసి మీ కాలనీలో గల శునకాల బెడదకు ఫుల్ స్టాప్ పెట్టండి.

Exit mobile version