NTV Telugu Site icon

California Senate : అమెరికాలో కుల వివక్ష నిషేధ బిల్లుకు కాలిఫోర్నియా ఆమోదం

California

California

అమెరికాలో ఓ చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలో కుల వివక్షను నిషేదించాలని కోరుతూ రాష్ట్ర సెనేట్ జ్యుడిషియల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదంచింది. దీన్ని భారతీయ-అమెరికన్ వ్యాపార, ఆలయ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కుల వివక్ష వ్యతిరేక బిల్లును సెనేట్ కు పంపేందుకు కాలిఫోర్నియా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇలా యూఎస్ లో ఓ రాష్ట్ర అసెంబ్లీ కులంపై చట్టాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి. ఈ బిల్లును అమెరికా సెనేట్ కూడా ఆమోదిస్తే దేశంలో ఇప్పటికే ఉన్న వివక్ష వ్యతిరేక చట్టాలలో కుల పక్షపాతాన్ని తొలిసారిగా చట్టవిరుద్దం చేసిన రికార్డు కూడా కాలిఫోర్నియాకు దక్కుతుంది. ఇవాళ కుల అణచివేతకు గురైన కాలిఫోర్నియా ప్రజలు ఇప్పుడు వారు రక్షణలను పొందేందుకు ఒక అడుగు దగ్గరగా ఉన్నారని చెప్పడానికి నా కుల అణచివేతకు గురైన కుల సభ్యుల, కుల సమానత్వ ఉద్యమ నిర్వాహకులు, మిత్రుడు నేను గర్వంగా సంఘీభావం తెలుపుతన్నానంటూ ఈక్వాలిటీ ల్యాబ్స్, దిట్రామా ఆఫ్ కాస్ట్ రచయిత తెన్నొళి సౌందరరాజన్ వెల్లడించారు.

Also Read : Arvind Kejriwal: ఢిల్లీ సీఎం ఇంటి కోసం రూ.45 కోట్లు ఖర్చు!

రాష్ట్రంలో కుల వివక్ష ఎదుర్కొంటున్న ప్రజలు 15 ఏళ్లుగా కష్టపడి సాధించుకున్న ఫలితమే ఈ బిల్లు అని సౌందరరాజన్ పేర్కొన్నారు. ఈక్వాలిటి ల్యాబ్స్ సీటెల్ లో కుల వివక్ష వ్యతిరేక తీర్మానం ద్వారా దీనిపై దేశవ్యాప్త ప్రచారానికి నాయకత్వం వహిస్తుంది. ఫిబ్రవరిలో కుల వివక్షను నిషేదించిన మొదటి యూఎస్ నగరంగా సీటెల్ అవతరించింది. ఇప్పుడు దాదాపు 39.2 మిలియన్ల మంది జనాభతో పసిఫిక్ తీరం వెంబటి ఉన్న పశ్చిమ యూఎస్ రాష్ట్రం కాలిఫోర్నియా దీన్ని ఆమోదించింది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం, ఆఫ్ఘన్ అమెరికన్ కూడా అయిన సెనేటర్ ఐషా వహాబ్ గత నెలలో బిల్లును ప్రవేశపెట్టారు.
భారతీయ-అమెరికన్ రాజకీయవేత్త, ఆర్థికవేత్తచే ఆమోదించబడిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ ఆమోదించిన తర్వాత.. కుల వివక్షచట్టవిరుద్దం చేసిన మొదటి యూఎస్ నగరంగా సీటెల్ అవతరించిన సరిగ్గా ఒక నెల తర్వాత కాలిఫోర్నియా ఈ చట్టానికి ఆమోదం తెలిపింది.

Also Read : Rain alert: వర్ష బీభత్సంతో ఫిర్యాదులు.. రంగంలోకి డీఆర్ఎఫ్ బృందాలు

మరో వైపు పబ్లిక్ పాలసీలో కులాన్ని క్రోడీకరించడం వల్ల యూఎస్ లో హిందూ ఫోబియా మరింత ఉధృతమవుతుందని చాలా మంది భారతీయ అమెరికన్లు భయపడుతున్నారు. గత మూడు సంవత్సరాల్లో మహాత్మా గాంధీ, మరాఠా చక్రవర్తి శివాజీతో సహా పది హిందూ దేవాలయాలు.. ఐదు విగ్రహాలు యూఎస్ లో ధ్వంసమయ్యాయి. అమెరికాలో 4.2 మిలియన్ల మంది భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు నివసిస్తున్నారు. భారతదేశం 1948లో కుల వివక్షను నిషేదించింది. ఆ విధానాన్ని రాజ్యాంగంలో కూడా పొందుపరిచంది.