NTV Telugu Site icon

Calcutta: హైకోర్టు సంచలన నిర్ణయం.. 2010 తర్వాత నాటి ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

Oen

Oen

సార్వత్రిక ఎన్నికల వేళ కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీచర్ రిక్యూట్‌మెంట్ రద్దు చేసిన న్యాయస్థానం.. తాజాగా ఓబీసీ సరిఫికెట్లను రద్దు చేస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 2010 తర్వాత జారీ చేసిన సర్టిఫికెట్లను హైకోర్టు రద్దు చేసింది. దీంతో మరోసారి పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలినట్లైంది. 2010 తర్వాత జారీ చేసిన సుమారు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. రాష్ట్రంలో ఆయా సర్వీసులకు, పోస్టులకు రిజర్వేషన్ కోసం ఉపయోగించిన సర్టిఫికెట్లు చట్టవిరుద్ధంగా న్యాయస్థానం పేర్కొంది.

బీజేపీ స్పందన..

కోర్టు తీర్పుపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ.. మమతబెనర్జీపై ధ్వజమెత్తారు. మమత బుజ్జగింపు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. అక్రమంగా ముస్లింలకు మమత ప్రభుత్వం ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసిందని ఆరోపించారు.

 

మమత స్పందన..

హైకోర్టు ఆదేశాలపై మమతాబెనర్జీ స్పందించారు. తీర్పును అంగీకరిచండలేదని తేల్చి చెప్పారు. ఈ తీర్పు బీజేపీ ఆదేశానుసారగంగా వచ్చిందని కొట్టిపారేశారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇంటింటికి సర్వే చేశాకే బిల్లు రూపొందించినట్లు చెప్పారు. మంత్రివర్గం ఆమోదించాక.. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందని తెలిపారు. తాజా తీర్పు బీజేపీ ఆదేశానుసారంగా వచ్చిందని.. ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని మమత వెల్లడించారు.

 

కాంగ్రెస్ స్పందన..

హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ కూడా స్పందించింది. హైకోర్టు నిర్ణయం ఆశ్యర్యం కలిగించిందని పేర్కొంది. 5 లక్షల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందని.. ఓబీసీ కమ్యూనిటీకి ఇది చాలా పెద్ద దెబ్బగా అభివర్ణించింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్ సూచించింది.

 

అమిత్ షా స్పందన..
OBC సర్టిఫికేట్లు రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. మమతా బెనర్జీ ఎటువంటి సర్వే లేకుండానే 118 ముస్లిం కులాలకు OBC రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. ఎవరో కోర్టుకు వెళ్లారని.. దీన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందని చెప్పారు. 2010 నుంచి 2024 మధ్యకాలంలో జారీ చేసిన సర్టిఫికెట్లను మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకు కోసం వాడుకున్నారని.. అక్రమంగా ముస్లిం కులాలకు రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. హైకోర్ట్ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు.