NTV Telugu Site icon

Hyderabad: క్యాబ్‌డ్రైవర్‌కి డిజిటల్ పేమెంట్ చేసిన మహిళ.. ఆమెను ట్రాప్‌చేసి గోవా తీసుకెళ్లి…

Hyd News

Hyd News

ఓ క్యాబ్ డ్రైవర్ మహిళతో పులిహోర కలిపాడు. పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఆమె కాపురంలో నిప్పులు పోశాడు. ఆ డ్రైవర్ వికృత చేష్టల కారణంగా భార్యాభర్తలు ఎనిమిది సార్లు హైదరాబాద్-లండన్, లండన్-హైదరాబాద్ పరుగులు పెట్టారు. అసలు ఏం జరిగిందటే..

17 ఏళ్ల క్రితం వివాహం..
హైదరాబాద్ అల్వల్ కి చెందిన ఓ జంటకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వాళ్లకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం తన భర్త తన ఉద్యోగంలో భాగంగా ప్రమోషన్ రావడంతో లండన్ కి వెళ్లారు. భార్యా పిల్లల్ని ఇక్కడే వదిలేసి ఒంటరిగా గతేడాది లండన్ వెళ్లాడు. అతడి భార్య ఇద్దరు పిల్లల్తో కలిసి అత్తగారింట్లో ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె తల్లి చనిపోయింది. అస్తికలను కలిపేందుకు ఓ ట్రావెలర్ కారు మాట్లాడుకుని వెళ్లొచ్చారు. అయితే.. డ్రైవర్ కు అద్దెను గూగుల్ పే ద్వారా చేసింది. ఆ డ్రైవర్ ఆమె నంబరును సేవ్ చేసుకుని మొదటి రెండు మూడు రోజులు హాయ్, గుడ్‌మార్నింగ్‌లతో పలకరించాడు. ఆమె పెద్దగా స్పందించకపోవడంతో మరో అడుగు ముందుకేశాడు డ్రైవర్. మీ నవ్వు బాగుంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. మీకు చాలా టాలెంట్ ఉంది. అంటూ నెమ్మదిగా ఆమెను ట్రాప్ చేశాడు.

డ్రైవర్ మాయలో పడ్డ మహిళ.. 

దీంతో ఆమె కూడా వాడి మాయలో పడి ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడటం. అప్పుడప్పుడు కలవడం చేసింది. విషయం అత్తగారింట్లో తెలియడంతో వారు లండన్‌లో ఉన్న తన కుమారుడికి చెప్పారు. దీంతో సెప్టెంబరులో తన భార్యపిల్లల్ని లండన్‌ తీసుకెళ్లేందుకు పర్మీషన్ వచ్చింది. 16న వారిని లండన్ రప్పించాడు. అదే నెల 29న అతడి తల్లి మరణించారు. దీంతో అతను భార్యాపిల్లల్ని లండన్‌లోనే వదిలేసి ఇండియాకి వచ్చాడు. భర్త వచ్చిన మరుసటి రోజు భార్య కూడా పిల్లల్ని అక్కడే వదిలేసి ఇండియాకు వచ్చింది. ఓ గంటలో వస్తానని చెప్పి అమ్మ తమను వదిలేసి వెళ్లిందని పిల్లలు తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో భర్త భార్యకు ఫోన్ చేయగా.. స్విచ్ఛ్‌ఆఫ్ వచ్చింది. దీంతో హుటాహుటిన లండన్ వెళ్లాడు. అక్టోబర్ 1న లండన్ చేరుకుని భార్య గురించి ఆరా తీశాడు.

డ్రైవర్‌ కోసం లండన్ నుంచి ముంబైకి వచ్చిన మహిళ.. 

ఆమె లండన్ నుంచి ముంబైకి వచ్చిందని తెలిసి.. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిచాడు. చివరికి అక్టోబర్ 3న శంషాబాద్ మధురానగర్ కాలనీలో ఆమె ఉన్నట్లు తెలుసుకుని.. ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆమె తనను ఎవరో కిడ్నాప్ చేశారని.. శంషాబాద్‌లో ఉంచారని.. ఇప్పుడే బాలాపూర్ వైపు తీసుకెళ్తున్నారని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో భార్త పోలీసులు, స్నేహితులను అలర్ట్ చేశాడు. లండన్ నుంచి మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశాడు. అలర్ట్ అయిన సైబరాబాద్ పోలీసులు ఆమె ఫోన్‌ను ట్రాక్ చేశారు. చివరిలోకేషన్ రాజేంద్ర నగర్‌లో చూయించింది. ఎంత గాలించిన ఆచూకీ దొరకలేదు. మళ్లోసారి భర్త కాల్ చేయగా.. ఆమె మాట్లాడుతూ.. ట్యాక్సీ డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని.. గోవాలో ఉన్నట్లు తెలిపింది. గోవా నుంచి తిరిగి వస్తూ రిటర్న్ టికెట్, లైవ్ లొకేషన్ పంపింది. దీంతో స్నేహితులు ఆ వివరాలను శంషాబాద్ పోలీసులకు ఇచ్చారు. అలర్టైన పోలీసులు టికెట్ ఆధారంగా బస్సును ట్రాప్ చేసిన ఆమెతో పాటు నిందితుడిని కూడా బస్సు దిగకుండా చూడాలని డ్రైవర్‌కి తెలిపారు. అక్టోబర్ ఏడున అమన్‌గల్ వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు.

భర్తను చంపెస్తానని బెదిరించిన కేటుగాడు.. 

శంషాబాద్ పీఎస్‌కి తరలించారు. ఈ సమాచారాన్ని భర్తకు చెప్పడంతో అతడు హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ కేసుపై మహిళను విచారించగా.. చాలా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆమె లండన్ వెళ్లడంపై టాక్సీ డ్రైవర్ చాలా కోపంగా నువ్వు నాకు చెప్పకుండా లండన్ ఎందుకు వెళ్లావ్. అంత్యక్రియలకు వచ్చిన నీభర్తను చంపెస్తా. నేను ఉరేసుకుంటున్నా.. అని బెదిరించాడు. తన భర్త ప్రాణాలు కాపాడటంతో పాటు పరువు పోకుండా ఉండేందుకు అతను చెప్పినట్లే చేశానని ఆమె తెలిపింది. ఇదిలా ఉండగా.. ట్యాక్సీ డ్రైవర్‌ మాత్రం తన తప్పేమి లేదంటున్నాడు. ఆమె తనతో కలిసి ఉంటానందని.. ఇద్దరం కలిసే గోవాకు వెళ్లినట్లు తెలిపాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.