NTV Telugu Site icon

Cyclone Biparjoy: రానున్న 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపర్ జోయ్ తుఫాన్

Thufan

Thufan

బిపోర్‌జోయ్ తుఫాన్ ఉత్తర-ఈశాన్యల వైపు పయనిస్తున్నందున మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య అరేబియా సముద్రం వద్ద తీవ్రరూపం దాల్చింది. మరో మూడు రోజుల్లో తుఫాను ఉత్తర వాయువ్య దిశగా దూసుకుపోతుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ భారత దేశంలో మోస్తరుగా-అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కేరళ, కర్ణాటక తీరప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, లక్షద్వీప్‌లో ఆదివారం వరకు వర్షాలు కురుస్తాయి.

Read Also : Akash-Shloka Ambani: అంబానీ మనుమరాలి పేరేంటో తెలుసా?

కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎనిమిది జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్ మరియు కన్నూర్ ఉన్నాయి. రుతుపవనాలు దక్షిణ భారత రాష్ట్రానికి గురువారం వచ్చాయని వాతావరణ శాఖ వెల్లడించింది. షెడ్యూల్ కంటే ఏడు రోజులు వెనుకబడిందని IMD తెలిపింది.

Read Also : Varuntej – Lavanya: వైభవంగా వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థం

బిపార్జోయ్ తుఫాను కారణంగా ద్వీపకల్పంలో నెమ్మదిగా పురోగతితో..వాతావరణ వ్యవస్థ ప్రారంభం బలహీనంగా ఉండవచ్చని హెచ్చరించినప్పటికీ, వాతావరణశాఖ తెలిపింది. జూన్ 15 తర్వాత మాత్రమే వర్షపాతం పుంజుకునే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ భారతదేశం-ఈశాన్య ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలలో శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం కొనసాగుతుంది. ఇది రాబోయే రెండు రోజులలో భారీ వర్షంగా మారే అవకాశం ఉంది. అయితే రానున్న 24 గంటల్లో బిపార్జోయ్ తుఫాను తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ తెలిపింది.