Virender Sehwag Trolls Pakistan Ahead Of England Match: ఐసీసీ ప్రపంచకప్ 2023 ముగింపు దశకు వచ్చేసింది. లీగ్ దశలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా అధికారిక సెమీస్ బెర్తులు దక్కించుకోగా.. నాలుగో టీమ్‌గా దాదాపుగా న్యూజిలాండ్ అర్హత సాధించింది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లకు సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడిస్తేనే.. పాకిస్తాన్‌కు సెమీ ఫైనల్స్ అవకాశాలు ఉంటాయి.
ఇంగ్లాండ్‌పై తొలుత బ్యాటింగ్‌కు దిగితే పాకిస్తాన్ 300 పరుగులు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇంగ్లీష్ జట్టును 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఒకవేళ ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగి 300 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని పాక్ కేవలం ఆరు ఓవర్లలోనే సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు అస్సలు సాధ్యం కావు. దాంతో పాకిస్తాన్ ప్రపంచకప్ 2023 లీగ్ దశ నుంచి నిష్క్రమించక తప్పదు. ఇప్పటికే పాకిస్తాన్‌పై విమర్శలు వస్తున్నాయి. పాక్ మాజీలు బాబర్ సేనపై నిప్పులు చెరుగుతున్నారు. మాజీ పేసర్ వసీం అక్రమ్ అయితే సొంత జట్టుపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు.
పాకిస్తాన్.. ఇక బై బై అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో వీరేంద్ర సెహ్వాగ్ ఓ పోస్ట్ పెట్టాడు. సేఫ్ జర్నీ టు పాకిస్తాన్ అని సెటైర్లు వేశాడు. ‘భారత దేశంలో పాకిస్తాన్ జట్టుకు మర్యాదలు బాగానే జరిగాయి. బిర్యానీ టేస్ట్ వారికి బాగా నచ్చి ఉంటుంది. పాకిస్తాన్ ఏ జట్టును సపోర్ట్ చేస్తే.. ఆ జట్టు పాక్ లాగే ఆడుతుంది. బై బై పాకిస్తాన్.. సేఫ్ ఫ్లైట్ జర్నీ’ అంటూ సెహ్వాగ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pakistan ki khaas baat hai ki jis team ko Pakistan support karti hai, woh team Pakistan ki tarah khelne lagti hai 😂.
Sorry Sri Lanka. https://t.co/Qv960oju2m— Virender Sehwag (@virendersehwag) November 10, 2023