Site icon NTV Telugu

BYD Seal EV Price: భారత మార్కెట్లోకి బీవైడీ సీల్‌ ఈవీ.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 650 కిలోమీటర్ల ప్రయాణం!

Byd Seal Ev Price

Byd Seal Ev Price

BYD Seal EV Car Launch and Price in India: భారత ఆటో మార్కెట్‌లో మరో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ ‘బీవైడీ’ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఫిబ్రవరి 27 నుంచే సీల్ ఎలక్ట్రిక్ బుకింగ్స్‌ ఓపెన్ అయ్యాయి. రూ.1.25 లక్షలు చెల్లించి ఆన్‌లైన్‌లో మరియు బీవైడీ డీలర్‌షిప్‌లలో కారు బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ కారును పూర్తి ఛార్జ్‌ చేస్తే.. 650 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. భారత్‌లో బీవైడీ ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ మోడళ్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. బీవైడీ ఈ6 ఎలక్ట్రిక్ ఎంపీవీ, బీవైడీ ఆటో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లు ఉన్నాయి.

బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ మూడు వేరియంట్లలో అంబాటులో ఉంటుంది. డైనమిక్‌ ఎడిషన్‌ బీవైడీ పీల్‌ ధర రూ.41 లక్షలుగా ఉంది. ప్రీమియం వెర్షన్‌ ధర రూ.45.55 లక్షలు కాగా.. పెర్ఫార్మెన్స్‌ వెర్షన్‌ ధర రూ.53 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ కారు స్పోర్టీ లుక్‌లో ఉంటుంది. ఎలక్ట్రానిక్ హిడెన్‌ ఫ్లష్ డోర్ హ్యాండిల్, 19 అంగుళాల ప్రెసిషన్ బ్లేడ్ వీల్ హబ్, వాటర్‌డ్రాప్ ఆకారంలో ఉండే సైడ్ మిర్రర్‌లు ఈ కారుకి మరింత లుక్ తీసుకొచ్చాయి. ఈ కారు 3.8 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 650 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. కేవలం 15 నిమిషాలు ఛార్జింగ్‌తో 200 కిలోమీటర్ల ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.

Also Read: Kiwi Health Benefits : కివీలను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే వదలరు..

బీవైడీ కంపెనీ ఈ కారుపై వారెంటీ కూడా ఇస్తోంది. ఎనిమిదేళ్లు/1.6 లక్షల కిలోమీటర్లు పాటు బ్యాటరీపై, 8 ఏళ్లు/1.5 లక్షల కిలోమీటర్లు మోటార్‌పైన కంపెనీ వారెంటీ ఇస్తోంది. ఆరేళ్ల పాటు డీసీ అసెంబ్లీ, ఎలక్ట్రిక్‌ అసెంబ్లీ వారెంటీ ఉంది. మార్చి 31లోగా సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను బుక్‌ చేసుకున్న వారికి ఫ్రీ ఇన్‌స్టలేషన్‌తో పాటు 7 kw హోమ్‌ ఛార్జర్‌, 3 kw పోర్టబుల్‌ ఛార్జర్‌, BYD సీల్‌ మొబైల్ పవర్‌ సప్లై యూనిట్‌ ఫ్రీగా అందిస్తుంది. అంతేకాదు ఆరేళ్ల పాటు రోడ్ అసిస్టెన్స్‌, ఒక కాంప్లిమెంటరీ ఇన్‌సెప్షన్‌ సర్వీస్‌ ఉచితంగా పొందవచ్చు.

Exit mobile version