NTV Telugu Site icon

Mokshagnya : డిసెంబర్ 2 మోక్షజ్ఞ సినిమా షురూ..?

Prasanth Varma Mokshagna Movie

Prasanth Varma Mokshagna Movie

Mokshagnya : నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమాను హను-మాన్ వంటి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర బృందం రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, చిత్రాన్ని డిసెంబర్ 2న అధికారికంగా లాంఛ్​చేయాలని ప్లాన్ చేస్తోందట. డిసెంబర్ 2న క్లాప్ కొట్టి రెగ్యులర్ షూటింగులకు వెళ్లేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ షెడ్యూల్ ప్రీపేర్ చేస్తున్నారట.

Read Also:Maharashtra Polls: 65 మందితో తొలి జాబితా విడుదల చేసిన ఉద్ధవ్ థాకరే

ఈ సినిమాతోనే బాలీవుడ్ భామ రవీనా టాండన్ కూతురు రషా తథానీ హీరోయిన్​గా తెలుగు తెరకు పరిచయం కానుందనే టాక్ వినిపిస్తోంది. ప్రతినాయకుడిగా రానా పేరు అనుకుంటున్నట్లు సమాచారం. సినిమాను 2025 సెకండ్ హాఫ్​లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. గ్రాఫిక్స్ కూడా భారీగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. తన వారసుడి తొలి సినిమా కావడంతో బాలయ్య కూడా చిన్న కామియో రోల్ చేస్తారని, ఆ పాత్ర సినిమాను నెక్స్ట్ లెవెల్​కు తీసుకెళ్లేలా ఉంటుందని సినీవర్గాల అంచనా.

Read Also:Off The Record: వైఎస్ జగన్ ఆ నేతలకు పిలిచి మరీ టిక్కెట్లు ఇస్తే ఇప్పుడు అడ్రస్ లేరా?

ఈ చిత్రాన్ని లెజెండ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ బ్యానర్​పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. అలాగే బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని సమర్పిస్తున్నారు. ఇతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. బాలయ్య విజన్‌కు అనుగుణంగా, చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞ నటన, ఫైట్లు, డ్యాన్స్‌ల్లో శిక్షణ తీసుకుని ప్రత్యేకంగా రెడీ అయ్యారట.