Site icon NTV Telugu

6 వేలకే OnePlus 13R 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఇలాంటి డీల్స్ మళ్లీ మళ్లీ రావు!

Oneplus 13r

Oneplus 13r

OnePlus 13R Price Drop: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు చెందిన వన్‌ప్లస్ 13 ఆర్‌ (OnePlus 13R)ను మీరు డెడ్ చీప్‌గా కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ తక్కువ ధరకు ఇప్పుడు అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి 8 వేల రూపాయల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

వన్‌ప్లస్‌ కంపెనీ 13 ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో రూ.42,999 ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.38,500 కంటే తక్కువ ధరకు లిస్ట్ చేయబడింది. అంటే రూ.4,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ అనంతరం ఈ ఫోన్ ధర రూ.34,500 తగ్గుతుంది. అంటే మీరు మొత్తంగా 8 వేలు ఆదా చేసుకోవచ్చు.

వన్‌ప్లస్‌ 13 ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.28,550 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ మీకు వర్తిస్తే.. 3 ఆర్‌ రూ.6 వేలకే మీ సొంతం అవుతుంది. అయితే ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ వర్తించాలంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కండిషన్ బాగుండాలి. అలానే లేటెస్ట్ వర్షన్ అయుండి, ఎలాంటి డామేజ్ ఉండకూడదు. అప్పుడే మీకు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్‌ను ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు.

Also Read: Wireless Charging Highway: ఛార్జింగ్ టెన్షన్ లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.. రన్నింగ్‌లో రోడ్డుపైనే ఛార్జింగ్!

వన్‌ప్లస్ 13 ఆర్‌ ఫీచర్స్:
# 6.78 అంగుళాల 1.5కే ఓఎల్‌ఈడీ, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే
# స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3 ప్రాసెసర్‌
# 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
# ఏఐ పవర్డ్‌ ఆక్సిజన్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
# 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌
# 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 700 ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 50 ఎంపీ టెలిఫొటో కెమెరా
# ఐపీ65 రేటింగ్‌, ఆక్వా టచ్‌ 2.0
# నాలుగేళ్ల ఓఎస్‌ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు

 

Exit mobile version