Site icon NTV Telugu

Businessman Kidnap: బిజినెస్ మెన్ కిడ్నాప్ కు యత్నం.. రాజేంద్రనగర్ లో కలకలం

Kidnap

Kidnap

ఈమధ్యకాలంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం ఏం చేయడానికి వెనుకాడడం లేదు కొందరు కేటుగాళ్ళు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ కు విఫలయత్నం చేశారు. హీరో షోరూమ్ యజమాని సాయి కిరణ్ కు మత్తు మందు ఇచ్చి కారు లో కిడ్నాప్ కు ప్రయత్నించారు దుండగులు.. కిస్మత్ పూర్ కు చెందిన వ్యాపారవేత్త తన కారు లో షో రూమ్ కు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కిస్మత్ పూర్ బ్రిడ్జ్ దాటగానే వాష్ రూమ్ కని కారు ఆపాడు కారు డ్రైవర్. ఒక్కసారిగా కారు లోకి ఎక్కిన ముగ్గురు సభ్యుల తో కూడిన గ్యాంగ్. సాయి కిరణ్ కు మత్తు మందు ఇచ్చి మాస్క్ పెట్టారు కిడ్నాపర్లు.

Read Also: Rishabh Panth: రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్‌ పంత్‌కు తీవ్రగాయాలు

కారు స్టార్ట్ చేసి అత్తాపూర్ వైపు కారును పోనిచ్చిన డ్రైవర్. డెయిరీ ఫామ్ వద్దకు రాగానే తేరుకోని కారులో నుండి కింద కు దూకేశారు సాయి కిరణ్. హుటాహుటిన 100 డయల్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు సాయి కిరణ్. జరిగిన సంగతి పోలీసులకు వివరించాడు. వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్స్ ను పట్టుకుంది శంషాబాద్ ఎస్ఓటి బృందం. మరి కాసేపట్లో కిడ్నాపర్స్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు. సాయి కిరణ్ ను కిడ్నాప్ చేసి డబ్బులు లాగుదామనుకున్నారు కిడ్నాపర్స్. అయితే, ఆ ప్లాన్ ను భగ్నం చేశారు పోలీసులు.

Read Also: Heeraben Modi: మోడీ తల్లి హీరాబెన్ మృతికి పలువురి సంతాపం

Exit mobile version