బిజినెస్ చెయ్యాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగాలను వదిలి బిజినెస్ చేస్తున్నారు.. ఎటువంటి బిజినెస్ లాభాలు వస్తాయో చాలా మందికి తెలియదు.. అలాంటి వారికి అదిరిపోయే బిజినెస్ ఐడియాను తీసుకొచ్చాము.. అదేంటో ఓ లుక్ వేసుకోండి..
ఈరోజుల్లో అందరు నిత్యావసరాలు, పండ్లు తదితర పదార్థాలను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కరోనా కంటే ముందే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే విధానం మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చాయి.. అందులో టిఫిన్ ను ఎక్కువ కొనలేరు.. ఇదే మీరు బిజినెస్ గా మార్చుకోవచ్చు.. సామాన్యులు టిఫిన్ ను ఆన్లైన్లో ఆర్డర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని భావిస్తే ఆన్లైన్ టిఫిన్ వ్యాపారాన్ని ప్రారంభించడం బెస్ట్ ఐడియాగా చెప్పొచ్చు.. మీరు ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. కేవలం రూ. 5 నుంచి రూ. 10 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాకపోతే ఈ బిజినెస్ కు మీ స్థానికంగా పబ్లిసిటీ చేయడం అవసరం. మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు, యూపీఐ ద్వారా బిల్ ను తీసుకోవచ్చు..
ఈ బిజినెస్ కోసం వంట మాస్టర్, అలాగే డెలివరీ బాయ్ ను కూడా నియమించుకోవాలి.. దగ్గర్లో ఉండే ఏరియాల్లో ఆర్డర్లు పెట్టుకోవడం మంచిది.. మీరు మంచి క్వాలిటీతో సేవలు అందిస్తే మీ వ్యాపారం లాభల్లో సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాయంత్రం స్నాక్స్ కూడా డెలివరీ చేయొచ్చు. ఈ బిజినెస్ బాగా క్లిక్ అయితే.. రోజుకు రూ.2 వేలు, నెలకు రూ.60 వేల వరకు సంపాధించే అవకాశం ఉంటుంది..ఇంట్లోని మహిళలు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ బిజినెస్ ను ప్రమోట్ చేయడానికి మీరు సోషల్ మీడియా వేధికలను ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లను ఇంప్రెస్ చేయగలిగితే మీకు లక్షలు ఖర్చుపెట్టిన దొరకని పబ్లిసిటీ మీకు దొరుకుతుంది.. ఇలా మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు..