బిజినెస్ చెయ్యాలనే వారికి ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి అందులో కొన్ని భారీ లాభాలను కూడా ఇస్తున్నాయి..అయితే చాలా మంది తక్కువ పెట్టుబడితో బెస్ట్ బిజినెస్ ను ఎంచుకోవాలని భావిస్తున్నారు..అలాంటి వారు ఈ బిజినెస్ ను కేవలం రూ. 22, 000 వేలతో ప్రారంభించి నెలకు రూ. 50 వేలకు పైగా సంపాధించవచ్చు.. ఆ బిజినెస్ కారు వాషింగ్ బిజినెస్.. ఈ వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తే మెకానిక్‌ని కూడా నియమించుకుని వాషింగ్ తో పాటు, మీరు కారు మరమ్మత్తు బిజినెస్ కూడా ప్రారంభించవచ్చు..
ఈ బిజినెస్ ను మొదలు పెట్టాలంటే మీకు ప్రొఫెషనల్ మెషిన్ అవసరం. మార్కెట్లో అనేక రకాల యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాల ధర రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు.. అంటే రూ.14 వేల యంత్రం మీకు సరిపోతుంది.. వీటితో పాటు మీకు రెండు హార్స్ పవర్ యంత్రాలని పొందుతారు. అంతేకాదు మీరు 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను కొనుగోలు చేయాలి. దీని ధర దాదాపు రూ. 9 వేల నుంచి రూ.10 వేల రూపాయలు. షాంపూ, గ్లోవ్స్, టైర్ పాలిష్ మరియు డాష్‌బోర్డ్ పాలిష్‌తో సహా అన్ని వస్తువులకు రూ. 2 వేల వరకు ఖర్చు అవుతుంది..
బిజినెస్ స్టార్ట్ చెయ్యగానే లాభాలు రావు.. ఎవరినైనా మెకానిక్ ను పట్టుకొని చెయ్యడం వల్ల మీకు బిజినెస్ పెరుగుతుంది.. వాషింగ్ కోసం ఛార్జీ నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటుంది. ఒక చిన్న పట్టణంలో సాధారణంగా కారు వాషింగ్ కోసం దాదాపు రూ.150-450 వసూలు చేస్తారు. పెద్ద నగరంలో ఈ ఖర్చు కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈ లెక్కన చూసుకుంటే మీకు రోజుకు 8 కార్లు సర్వీస్ కు వచ్చినా మీకు రోజుకు 2 వేలు రూపాయలు వస్తాయి.. నెలకు రూ. 40 వేల నుంచి రూ.60 వేలు సంపాధించవచ్చు… సులువుగా సంపాదించే బిజినెస్.. మీకు నచ్చితే మీరు కూడా ప్రారంభించండి..