NTV Telugu Site icon

Thandel: ఇదేం దారుణం.. ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శన.. నిర్మాత ఆవేదన

Thandel

Thandel

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించగా గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పించారు. గుజరాత్ తీరంలో పాకిస్తాన్ నేవీ చేతిలో చిక్కుకున్న జాలర్ల కథగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు హిందీ సహ తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్.. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే సినిమాకి సంబంధించిన హెచ్డి ప్రింట్ ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది.. అయితే తాజాగా ఆ ప్రింట్ ను ఒక ఆంధ్ర ప్రదేశ్ బస్సులో ప్లే చేసినట్లుగా సినిమా నిర్మాత బన్నీ వాసు ఆరోపించారు.

Tandel: ‘తండేల్’ 3 డే కలెక్షన్స్

ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ నెంబర్ 3066లో మా సినిమా పైరేటెడ్ వెర్షన్ ప్లే చేసినట్లు తెలుసుకున్నాం. ఇలా చేయడం చట్ట విరుద్ధమే కాదు ఒకరకంగా దౌర్జన్యం కూడా. ఈ సినిమాని తెరమీదకు తీసుకువచ్చేందుకు ఎంతోమంది చేసిన విశ్రాంతమైన కృషికి జరిగిన ఘోర అవమానం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా అనేది నటీనటులు దర్శకుడు నిర్మాతల కల అని ఆయన అన్నారు.. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు సీరియస్గా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బలమైన ఉదాహరణ సెట్ చేయాలని తాను కోరుతున్నట్టుగా బన్నీ వాసు వెల్లడించారు.