NTV Telugu Site icon

బుమ్రా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడా..?

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో చాలా మంది భారత ఆటగాళ్లు పెళ్లి పీటలు ఎక్కారు. అయితే ఇప్పుడు తాజాగా మరి భారత ఆటగాడు కూడా పీటలు ఎక్కబోతున్నాడు తెలుస్తుంది. భారత స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లికోసమే బుమ్రా ఇంగ్లండ్‌ తో జరిగే చివరి టెస్ట్ నుండి మాత్రమే కాదు వన్డే, టీ20 సిరీస్‌ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీకి చెప్పాడని సమాచారం. అయితే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల కోసం సెలవులు తీసుకున్నాడని తెలుస్తోంది. కాని పెళ్లి తేదీ గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అటు పెళ్లి కూతురు ఎవరనే విషయాన్ని కూడా రహస్యంగా ఉంచాడు ఇండియన్‌ బౌలర్‌. చూడాలి మరి బుమ్రా తన పెళ్లి విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తాడు అనేది.