Site icon NTV Telugu

Bullet Train: తన వైభవాన్ని చాటనున్న బుల్లెట్ రైలు.. రెడీ అయిన మొదటి టెర్మినల్

New Project (22)

New Project (22)

Bullet Train: బుల్లెట్ రైలు వేగాన్ని ఆస్వాదించడానికి భారతీయులు మరెంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇచ్చిన అప్‌డేట్ నుండి దీనికి సంబంధించిన సూచనలు రావడం ప్రారంభించాయి. ఒక వీడియో ద్వారా.. అతను దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు టెర్మినల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. టెర్మినల్ వీడియోలో సంస్కృతి, ఆధునికత కలయిక స్పష్టంగా కనిపిస్తుంది. 2022-2023 నాటికి బుల్లెట్ రైలు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ వీడియోను రైల్వే మంత్రి వైష్ణవ్ విడుదల చేశారు. దాదాపు 43 సెకన్ల ఈ వీడియోలో.. టెర్మినల్‌లో చేర్చబడిన అనేక ఫీచర్లు, ఆధునికత చూపబడ్డాయి. అతను ‘భారతదేశం మొదటి బుల్లెట్ రైలు కోసం నిర్మించిన టెర్మినల్’ అని రాసుకొచ్చాడు. విశేషమేమిటంటే భారతదేశంలో బుల్లెట్ రైలుకు పునాది 2017 సంవత్సరంలో జరిగింది.

Read Also:Hi Nanna: ఓటిటి లోకి రానున్న ‘Hi Nanna’.. ఎప్పుడు, ఎక్కడంటే?

2017లో రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకారం.. ఈ రైలు ముంబై – అహ్మదాబాద్ స్టేషన్లను కలుపుతుంది. సబర్మతి-ముంబై (508 కి.మీ) మధ్య రైల్వే ట్రాక్ భూమిపై నిర్మించిన స్తంభాలపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 12 స్టేషన్లు ఉంటాయి. గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు, ఆపరేటింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్లు.

Read Also:West Bengal : మెడికల్ కాలేజీలో 24 గంటల్లో తొమ్మిది మంది శిశువుల మృతి

జపాన్ ప్రభుత్వం సహాయం
రైల్వే మంత్రిత్వ శాఖ.. ‘ముంబై – సబర్మతి మధ్య ప్రయాణ సమయం 2.07 గంటలు. రైలు మార్గంలో అన్ని స్టేషన్లలో ఆగితే ప్రయాణం 2.58 గంటలు పడుతుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం – రూ. 1,08,000 కోట్లు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 81 శాతం జపాన్ ప్రభుత్వం రుణంగా అందించింది. 0.1 శాతం వడ్డీ రేటుతో ఈ లోన్ 15 సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌తో 50 సంవత్సరాలలో తిరిగి చెల్లించబడుతుంది. భారత ప్రభుత్వం హై స్పీడ్ రైలు అంటే హెచ్‌ఎస్‌ఆర్‌ను ప్లాన్ చేస్తోంది. ఇందులోభాగంగా 6 అదనపు కారిడార్లకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. వీటిలో ఢిల్లీ నుండి వారణాసి, ఢిల్లీ నుండి అహ్మదాబాద్, ముంబై నుండి నాగ్‌పూర్, ముంబై నుండి హైదరాబాద్, చెన్నై నుండి మైసూర్, ఢిల్లీ నుండి అమృతసర్ ఉన్నాయి.

Exit mobile version