Site icon NTV Telugu

Jagan Mohan Reddy: జగన్ టూర్లకు బుల్లెట్ ఫ్రూఫ్ బస్

Cm Bullet

Cm Bullet

ఏపీ సీఎం జగన్ ఇక నుంచి జిల్లా పర్యటనలు చేయనున్నారు. సీఎం జగన్ జిల్లా పర్యటనలకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్దం చేస్తోంది ప్రభుత్వం. సీఎం పర్యటనల నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్దం చేయాల్సిందిగా ఆర్టీసీకి ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుచ పాంట్రీ వాహనం కండిషన్‌ చెక్ చేశారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.

గతంలో 2009, 2015 సంవత్సరాల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహానాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం. ఇప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను వినియోగించలేదు సీఎం జగన్. అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతున్నా బుల్లెట్ ఫ్రూప్ వాహనాలు వాడకపోవడంతో ఇక నుంచి జగన్ చేసే పర్యటనల్లో అన్నీ బుల్లెట్ ఫ్రూప్ వాహనాలే వుండనున్నాయి. త్వరలో సీఎం జిల్లా పర్యటనలు ఉండే అవకాశం ఉండడంతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులను సిద్దం చేస్తోంది ఆర్టీసీ.

Read Also: Anilkumar Yadav: నేను ఒంటరిని కాదు.. జగనే అండ

Exit mobile version