Site icon NTV Telugu

Bounty Alert: బుజ్జి ఫాన్స్ అలెర్ట్.. బేబీ మిస్సింగ్..

Veeranjaneyulu Vihara Yatra

Veeranjaneyulu Vihara Yatra

సీనియర్ నటుడు నరేష్, అలాగే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో తెలుగులో ” వీరాంజ‌నేయులు విహార‌యాత్ర ” పేరుతో ఓ కామెడీ మూవీ తెర‌కెక్కుతోంది. అయితే., ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇన్దుకు సంబంధించి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అతి త్వరలో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడూ గొడవలు పడే ఓ కుటుంబం పాతకాలంనాటి వ్యాన్ లో గోవా వెళ్లాలని అనుకుంటారు. అయితే ఆ వ్యాన్ లో చేస్తున్న జర్నీలో వారికి ఎదురైన పరిణామంలో అవుట్ అండ్ డౌట్ కామెడీ ఎంటర్టైనర్ గా వీరాంజనేయులు విహారయాత్ర మూవీ తెరకెక్కుతోంది.

Video Game At Surgery: సర్జరీ చేస్తుండగా వీడియో గేమ్ ఆడిన యువకుడు.. (వీడియో)

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి తాజాగా యాక్టర్ నరేష్ ఓ వీడియో రూపంలో ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా నరేష్ మాట్లాడుతూ.. నాగేశ్వరావు గారు మా బేబీ ఎక్కడికో వెళ్లిపోయింది సార్.. అది లేకుండా మాకు ముద్ద కూడా దిగదు.. సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది సార్.. తిరిగాను, అందర్నీ అడిగాను, కల్కిలో బుజ్జి తెలుసు కానీ.. ఈ బేబీ ఎవరో తెలియదని హేళన చేస్తున్నారు. మీ బుజ్జి లాంటిది.. మా బేబీ కూడా, మీకు బుజ్జి ఎంతో.. మాకు బేబీ కూడా అంతే.. దయచేసి అది కనపస్తే మాకు అందించడానికి సహకరించండి సార్.. ఈ వీడియో చూసే వారికి ఎవరికన్నా బేబీ దొరికితే మాకు బేబీని ఇవ్వండి ప్లీజ్ అంటూ ఓ పాత కాలపు వ్యాన్ ను రివిల్ చేస్తారు. చివర్లో సినిమాకు సంబంధించిన పోస్టర్ ” వీరాంజనేయులు విహారయాత్ర ” వేస్తారు. ఈ వీడియోకు కల్కి సినిమా నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేయడంతో వీడియో కాస్త వైరల్ అయింది.

dinosaur fossil: ఇంటి వెనుక తవ్వకాల్లో బయటపడ్డ డైనోసార్‌ ఎముకలు.. రూ.373 కోట్లకు విక్రయం

ఇది ఇలా ఉండగా.. తాజాగా కల్కి దర్శకుడు నాగ అశ్విన్ ఈ వీడియోకి ప్రతిస్పందనగా.. ఓ పోస్టర్ ను విడుదల చేసి.. అయ్యో నాగేశ్వరావు గారు.. మీరు ఏమి బాధపడొద్దండి అంటూ.. బుజ్జి ఫాన్స్ అసెంబుల్ అవ్వండి. మనకు వీరాంజనేయులు విహారయాత్ర నుండి బేబీ తప్పిపోయినట్లుగా సమాచారం. కాబట్టి ఎవరైనా బేబీని కనిపెట్టి వారి ఓనర్స్ కు చేర్చండి అంటూ తెలిపారు. అయితే ఇప్పుడు అశ్విన్ షేర్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version