దేశంలో పెట్రో, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. వాహనదారులకు ఇది పెను భారంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి కనబర్చుతున్నారు. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత పండుగ సీజన్ కాబట్టి చాలామంది కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే బడ్జెట్ రూ.10 లక్షల వరకు మాత్రమే ఉంటే.. ఈ కార్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
Tata Tiago EV Price:
టాటా మోటార్స్ కంపెనీకి చెందిన టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు ధర రూ.7 లక్షల 99 వేల (ఎక్స్‌షోరూం) నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.11 లక్షల 49 వేలు (ఎక్స్‌షోరూం). ఈ కారు ఫుల్ ఛార్జింగ్‌పై 275 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. 0 నుండి 60కి స్పీడ్ చేరుకోవడానికి 5.7 సెకన్లు పడుతుంది.
MG Windsor EV Price:
చైనాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ మోటార్‌కు చెందిన ఎలక్ట్రిక్ కారువిండ్‌సోర్ ఈవీ. ఈ కారు ధర రూ.9.90 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 331 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ కారులో సింగల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది 38 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఆధారంగా పనిచేస్తుంది. అక్టోబర్ 12 నుంచి డెలివరీలు మొదలయ్యాయి.
TATA Punch Price:
టాటా పంచ్ ప్రారంభ ధర రూ.9,99,000 (ఎక్స్‌షోరూం) నుండి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.14,29,000 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేయొచ్చు. ఈ కారు 0 నుండి 100 వరకు వేగవంతం కావడానికి 9.5 సెకన్లు పడుతుంది.
Also Read: IND vs NZ: రోహిత్‌ను తప్పుపట్టలేం.. ఓటమిలో వారి పాత్ర కూడా ఉంది: కివీస్ మాజీ పేసర్
MG Comet Price:
ఎంజీ కామెట్ ధర రూ.6,99,000 (ఎక్స్‌షోరూం) నుండి మొదలవుతుంది. ఇందులో 17.3kWh లిథియం ఐయాన్ బ్యాటరీని ఇచ్చారు. సింగిల్ ఛార్జ్‌తో 230 కిలోమీటర్లు వెళ్లొచ్చు. 0-100 శాతం ఛార్జింగ్‌కు 7 గంటల సమయం పడుతుంది. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం రూ.519 మాత్రమే అవుతుందని కంపెనీ చెబుతోంది.