AMAs 2026: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో దుమ్మురేపిన BTS.. మూడు అవార్డులతో సెన్సేషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AMAs 2026 BTS: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను ఉన్న కే-పాప్ సూపర్ గ్రూప్ BTS మరోసారి తమ సత్తా చాటింది. అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ (AMAs) 2026లో BTS మూడు ప్రధాన అవార్డులను గెలుచుకుని అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. లాస్ వెగాస్‌లో సోమవారం నాడు జరిగిన ఈ ప్రతిష్టాత్మక వేడుకలో BTS గ్రూప్ తమదైన శైలిలో ఆకట్టుకుంది.
ప్రపంచ సంగీత రంగంలోని లేడీ గాగా, జస్టిన్ బీబర్, బ్రూనో మార్స్, హ్యారీ స్టైల్స్, సబ్రినా కార్పెంటర్ వంటి స్టార్ కళాకారులతో పోటీ పడిన BTS, అభిమానుల ఓట్లతో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును BTS రెండోసారి గెలుచుకుంది. ఇంతకుముందు 2021లో కూడా ఈ అవార్డును అందుకుంది. అంతేకాకుండా BTS తాజా ఆల్బమ్ ‘ARIRANG’లోని ‘SWIM’ పాటకు ‘సాంగ్ ఆఫ్ ది సమ్మర్’ అవార్డు లభించింది. అలాగే ‘బెస్ట్ మేల్ కె-పాప్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా BTS ఖాతాలో వేసుకుంది. మొత్తంగా మూడు అవార్డులతో ఈ వేడుకలో BTS ఆధిపత్యం చాటింది.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
అవార్డులు అందుకున్న తర్వాత BTS సభ్యులు భావోద్వేగ ప్రసంగాలతో అభిమానులను అలరించారు. BTS సభ్యుడు RM మాట్లాడుతూ.. “ARMYs ను మేము మళ్లీ సాధించాం. ఈ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా ఉంది. మా మిలిటరీ సర్వీస్ తర్వాత కూడా మీరు మాతో నిలిచారు. గత 13 ఏళ్లుగా మాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు. మరో సభ్యుడు జే-హోప్ కూడా అభిమానుల ప్రేమపై స్పందిస్తూ.. “ఈ ఆల్బమ్‌కు వచ్చిన స్పందన మాకు అద్భుతంగా అనిపించింది. ‘ARIRANG’ ఆల్బమ్‌లోని ప్రతి పాటను మీరు ఆదరించారు. నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. అలాగే జిమిన్, జిన్, వీ, జంగ్‌కుక్ కూడా అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. టూర్ సమయంలో నగరాల వెంట తమను అనుసరించి ప్రేమ చూపించిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Congratulations, @bts_bighit! "SWIM" is the Song of the Summer! 🏆 #AMAs pic.twitter.com/GBe930bgD6
— American Music Awards (@AMAs) May 26, 2026
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?