బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు సరసమైన ప్లాన్స్ ను అందిస్తోంది. కంపెనీ డేటా సమస్యలను తొలగించే ప్రత్యేక స్టూడెంట్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. పాఠశాలలు, కళాశాలల్లో ఆన్‌లైన్ క్లాసులు ఎక్కువగా జరుగుతుండటంతో, విద్యార్థులకు డేటా ఎక్కువగా అవసరమవుతుంది. దీనిని గుర్తించిన BSNL విద్యార్థుల కోసం సరసమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ. 251. ఈ ప్లాన్ 100GB డేటాను, అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ అద్భుతమైన ప్లాన్ గురించి మరింత తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ రూ.251 ప్లాన్
BSNL నుంచి వచ్చిన ఈ ప్లాన్ ధర రూ. 251. ఇది ప్రత్యేకంగా ప్రతిరోజూ ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే, వీడియో కంటెంట్ చూసే లేదా అసైన్‌మెంట్‌లు, ప్రాజెక్ట్‌లను సమర్పించడానికి ఇంటర్నెట్‌పై ఆధారపడే విద్యార్థుల కోసం రూపొందించారు. ఈ BSNL లెర్నర్ ప్లాన్ 100GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. ప్రతిరోజూ 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. తక్కువ ధరకు మెరుగైన నెట్‌వర్క్ కోరుకునే విద్యార్థులకు ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
