BSNL సరికొత్త శాటిలైట్ ఫోన్ను భారతదేశంలో లాంచ్ చేసింది. మొబైల్ టవర్లు లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. పన్నులతో కలిపి ఈ ఫోన్ ధర రూ. 1,34,166 గా నిర్ణయించారు.
ఇది ఎలా పని చేస్తుంది?
సాధారణ స్మార్ట్ఫోన్ల లాగా కాకుండా.. ఈ డివైజ్ సెల్యులార్ నెట్వర్క్ల స్థానంలో నేరుగా ఇన్మార్శాట్ వంటి గ్లోబల్ శాటిలైట్ నెట్వర్క్ల సహాయంతో కనెక్ట్ అవుతుంది. మొబైల్ సిగ్నల్స్ అస్సలు లేని అడవులు, కొండ ప్రాంతాలలో సైతం దీని ద్వారా వాయిస్ కాల్స్ సులభంగా మాట్లాడుకోవచ్చు.
ముఖ్యమైన ఫీచర్లు..
మొబైల్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లో శాటిలైట్ కనెక్టివిటీ.
ఎమర్జెన్సీ సమయాల్లో సహాయం కోసం ‘SOS’ సపోర్ట్.
ఛార్జింగ్ సదుపాయం లేని చోట కూడా ఎక్కువ కాలం పనిచేసేలా లాంగ్ బ్యాటరీ లైఫ్.
కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేలా రగ్గడ్ మరియు మన్నికైన డిజైన్.
When conventional mobile networks can’t reach, the BSNL Satellite Phone keeps you connected.
Designed for challenging environments, making it an ideal solution for Defence, Maritime, Disaster Response, Mining, Remote Operations and Adventure Travel.
Why Choose BSNL Satellite… pic.twitter.com/Fc6vsahxRn
— BSNL India (@BSNLCorporate) July 9, 2026
ఎవరు కొనుగోలు చేయవచ్చు?
ఈ ఫోన్ సాధారణ వినియోగదారుల కోసం ఉద్దేశించింది కాదు. రక్షణ రంగం, సముద్రయాన కార్యకలాపాలు, విపత్తు నిర్వహణ, మైనింగ్ సంస్థలు, మారుమూల పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసేవారు, తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు, అడ్వెంచర్ ట్రావెలర్స్ కోసం దీనిని రూపొందించారు.
భారతదేశంలో శాటిలైట్ ఫోన్ల వాడకంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ ఫోన్ కొనాలన్నా లేదా ఉపయోగించాలన్నా కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా దీనిని కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. మరోవైపు బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన 4G నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపు 99,000 సైట్లను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.

