Site icon NTV Telugu

Jaish Terrorist Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. సరిహద్దులో జైషే ఉగ్రవాది అరెస్ట్

Jaish Terrorist

Jaish Terrorist

Jaish Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో శుక్రవారం ఆయుధాలు ధరించిన జైషే మహ్మద్ ఉగ్రవాదిని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా అరెస్టు చేసింది. రాజౌరి జిల్లాలోని బుధాల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాలిక్, పూంచ్, రాజౌరిలలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థకు ఓవర్‌గ్రౌండ్ వర్కర్ (OGW)గా పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు.

READ ALSO: Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ పాలన మరింత బలోపేతం.. కీలక సంస్కరణలకు పవన్‌ శ్రీకారం..

ఖాలిక్ కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయాడు. ఆయన ఆయుధ శిక్షణ కోసం పాకిస్థాన్‌కు వెళ్లాడని, శుక్రవారం అక్రమంగా ఆయుధాలతో సరిహద్దులోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా అప్రమత్తమైన BSF సిబ్బంది అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పట్టుకున్నారు. విచారణ కోసం ఆయనను పోలీసులకు అప్పగించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏడు నెలల పాటు ఎటువంటి కదలికలు లేకుండా ఉన్న సాంబా, కథువా, జమ్మూ సెక్టార్లకు ఎదురుగా ఉన్న సియాల్‌కోట్, జఫర్వాల్ ప్రాంతాలలో పాకిస్థాన్ 12 లాంచ్ ప్యాడ్‌లను తిరిగి యాక్టివేట్ చేసిందనే సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి.

READ ALSO: Indigo Crisis: విమాన ఛార్జీలను మేం నియంత్రించలేం: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు

Exit mobile version