Site icon NTV Telugu

Chennai: బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య.. తల నరికేసిన దుండగులు

Bjp

Bjp

తమిళనాడులో బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య సంచలనంగా మారింది. అత్యంత కిరాతకంగా అంతమొందించారు దుండగులు. తలనరికి హత్య చేశారు. మహిళా నేత హత్యతో తమిళనాడు ఉలిక్కిపడింది. గత రాత్రి శరణ్య ఇంటికి వెళుతుండగా వెంటాడిన దండుగులు తల నరికి చంపారు. మధురై సెంట్రల్ నియోజకవర్గం బీజేపీ మాజీ నాయకురాలుగా ఉన్న శరణ్య. గత ఎడాది మధురై పర్యటన సమయంలో మంత్రి పళబివేల్ త్యాగరాజన్ కారుమీదా శరణ్య చెప్పులు విసిరింది. అకేసులో శరణ్య సహా పలువురు బిజెపి నేతలు అరెస్టు అయ్యారు. రాజకీయ కక్షలతో హత్య జరిగిందా లేక వ్యక్తిగత గొడవల కారణంగా ఈ ఘోరానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Exit mobile version