మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత నాయక్ పై బీఆర్ఎస్ సర్పంచ్ అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. నరసింహుల పేట మండలం గోపాతండా వద్ద ఘటన చోటు చేసుకుంది. నరసింహుల పేట మండలంలోని పెద్ద నాగారం గ్రామ శివారు తండాలో ప్రచారాన్ని కొనసాగించిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీత నాయక్.. అదే తండాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పర్యటించారు. రాజకీయ గురువుపై నర్సింహులపేట మండల జడ్పీటీసీ భూక్యా సంగీత నాయక్ పోటీకి దిగాడు. దీంతో గత కొన్ని రోజులుగా జడ్పీటీసీ సంగీతను పార్టీకి ఎమ్మెల్యే రెడ్యానాయక్ దూరం పెట్టారు.
Read Also: Salaar: ఒరేయ్.. ప్రభాస్ లేకుండా ఐటెంసాంగ్ ఏంటి రా.. బాబు .. ?
దీంతో భూక్య సంగీత నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈటెల రాజేందర్ సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుండి డోర్నకల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న సంగీత.. నామినేషన్ వేసిన తదుపరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక మహిళలతో గిరిజన సాంప్రదాయ నృత్యం చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి సంగీతను సర్పంచ్ భర్త నెట్టివేశాడు. ఓటమి భయంతోనే దాడి చేసినట్లుగా సంగీత నాయక్ ఆరోపిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్- బీజేపీ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.