Kavitha’s Judicial Remand Ends Today: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సుమారు కొన్ని రోజులుగా తీహార్ జైల్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ, ధ్యానం మరియు ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతున్నారు. నేటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పోలసీ కేసులో ఈడీ, సీబీఐ రిమాండ్లు కూడా నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో, తీహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు, కవిత పాత్రపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.