కాచిగూడ లింగంపల్లి రాఘవేంద్ర స్వామి ఆలయంలో పూజ నిర్వహించిన అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి అంబర్ పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాలేర్ వెంకటేష్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. సంప్రదాయ డప్పు వాయిద్యాలు, బోనాలు మరియు కేరళ సింగారి మేలమ్ వాయిద్యాల మధ్య భారీ ర్యాలీగా బయలుదేరిన కాలేరు వెంకటేష్ కు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఇక, భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి.
Read Also: Uttar Pradesh: రికార్డుల్లో నేను చనిపోయాను.. కానీ నాకు ఏకే 47 కావాలి.. ప్రధాని కార్యదర్శికి లేఖ
ఇక, నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ఆయన తెలిపారు. దీని ఫలితంగా ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా ఆదరణ పెరిగిందని మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని నియోజకవర్గ పరిధిలో గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేశామని ఆయన తెలిపారు.