తెలంగాణలో “మిడ్ డే మీల్స్ స్కీమ్” పేరుతో బీఆర్ఎస్ నేత అరవింద శెట్టి భారీ స్కాంకు పాల్పడినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు ఉపయోగించి అరవింద్ నాలుగు కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ఆగ్రో కమాడిటీస్ సప్లై పేరుతో పలువురు వ్యాపారులను అరవింద్ మోసం చేసినట్లు పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే.. 2021 నుండి 4 కోట్ల రూపాయలు అరవింద్ వసూలు చేసినట్లు సమాచారం. మిడ్ డే మీల్స్ స్కీమ్ ప్రాజెక్టు ఓకే అయింది అంటూ బిజినెస్ మాన్స్‌ను అరవింద్ నమ్మిoచారు.
ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ను అరవింద్ క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ ప్రభుత్వ జీవో తయారీ చేసిన అరవింద్‌పై డిసెంబర్ 4న బొలినేని ధనుష్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రవింద్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యక్రమాలను చూస్తుంటారని సమాచారం. ఇతను కేటీఆర్, కవితలకు అభిమాని. హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుంచి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు.
