పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న కామెడీ ఫాంటసీ సినిమా బ్రో.దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందుతుంది పీపుల్స్ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభోట్ల ఈ సినిమా ను భారీగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా జూలై 28వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల అవుతుంది. పవన్ కల్యాణ్ దేవుడి పాత్ర పోషిస్తున్న బ్రో సినిమా ఫస్ట్ లుక్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. ఇటీవల విడుదల అయిన టీజర్ కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ టీజర్ కు యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ వచ్చాయి. రీమేక్ సినిమా అయినా కూడా బ్రో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.ఫస్ట్ లుక్ మరియు టీజర్ తో భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమాను చూసేందుకు అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో ఈ సినిమాపై క్రేజ్ భారీగా పెరిగింది.. అలాగే విడుదలకు ముందే ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ నమోదు చేసింది.
బ్రో సినిమా ఓవర్సీస్ హక్కులను అమెరికాకు చెందిన పీపుల్స్ సినిమాస్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నదని సమాచారం.అలాగే సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది.. ఆంధ్రా హక్కులు 40 కోట్ల రూపాయలకు మరియు నైజాం హక్కులను 30 కోట్లు అలాగే సీడెడ్ హక్కులు 15 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగిందనే విషయం సినీ ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తం కలిపి 83 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు సమాచారం..అలాగే ఇతర రాష్ట్రాల హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం…ఇక బ్రో సినిమా తో ప్రపంచవ్యాప్తంగా పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ది బెస్ట్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల విలువ 100 కోట్ల రూపాయలని తెలుస్తుంది.. అయితే ఈ సినిమా బిజినెస్ వివరాలు మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది