లండన్: కమలా హ్యారిస్‌ను ఇండియన్ అని సంబోధించినందుకు మన్నించాలని బ్రిటీష్ పార్లమెంటరీ నేత జాన్ కిల్‌క్లూనీ కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్‌ను అభినందించేందుకు కిల్‌క్లూనీ ట్విటర్ వేదికగా ఈ మధ్య ఓ ట్వీట్ చేశారు. అందులో కమలా హ్యారిస్‌ను ఇండియన్ అంటూ సంబోధించారు. అయితే ఈ ట్వీట్‌పై తీవ్ర దుమారమే రేగింది. బ్రిటీష్ పార్లమెంట్ స్పీకర్ కూడా దీనిని తప్పుబట్టారు. కిల్‌క్లూనీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూచించారు. దీంతో కిల్‌క్లూనీ నేడు మరో ట్వీట్ చేశారు. కమలా హ్యారిస్‌పై తాను చేసిన ‘ఇండియన్’ కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నానని, తన వ్యాఖ్యలు చాలా మందిని బాధించినందుకు క్షమించాలని పేర్కొన్నారు. అయితే కమలా హ్యారిస్ భారతీయ మూలాలు కలిగిన మహిళేనని, దానిని ఆమె గర్వంగా భావిస్తుందని చెప్పుకొచ్చారు.
కమలా హ్యారిస్‌ను ఇండియన్ అన్నందుకు క్షమించండి: బ్రిటీష్ పార్లమెంటరీ నేత
