NTV Telugu Site icon

Biggest Cucumber: ప్రపంచంలోనే అతిపెద్ద దోసకాయ.. మోయాలంటే ఇద్దరు మనుషులు కావాలి

British Gardener

British Gardener

Biggest Cucumber: ప్రపంచంలో వింత విషయాలు జరుగుతూనే ఉంటాయి. అవి ప్రజలను ఆలోచించేలా చేస్తుంటాయి. ప్రతి ఒక్కరికి దోసకాయ గురించి తెలుసు. ఇది సాధారణంగా సలాడ్‌గా ఉపయోగించబడుతుంది. పెద్ద సైజు దోసకాయ బరువు సాధారణంగా 250 నుండి 300 గ్రాములు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఓ దోసకాయ ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, బరువైన దోసకాయ. ఇది కట్ చేస్తే ఓ పెళ్లికి వచ్చిన వారందరీ ఈ దోసకాయతో భోజనం పెట్టవచ్చు. అంత పెద్దది ఈ దోసకాయ.

Read Also:Allu Arjun: అట్లీని కలిసిన అల్లు అర్జున్… ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యినట్లేనా?

ఈ పెద్ద దోసకాయను విన్స్ స్జోడిన్ పేరుగల తోటమాలి పెంచారు. అతడి వయసు 50 ఏళ్లు. 30 పౌండ్ల బరువున్న 13.60 కిలోల బరువున్న ఒక దోసకాయ మాత్రమే పండించాడు. వోర్సెస్టర్‌షైర్‌లోని మాల్వెర్న్‌లో జరుగుతున్న యూకే నేషనల్ జెయింట్ వెజిటబుల్స్ ఛాంపియన్‌షిప్‌కు వృత్తిరీత్యా తోటమాలి అయిన విన్స్ ఈ 4 అడుగుల పొడవైన దోసకాయతో వచ్చినప్పుడు, అందరూ దానిని చూసి ఆశ్చర్యపోయారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోసకాయగా అభివర్ణించబడుతోంది. ఇంత పెద్ద దోసకాయను ఇప్పటివరకు ఎవరూ పండించలేకపోయారు. ఇది చరిత్రలో అతిపెద్ద దోసకాయగా మారింది.

Read Also:Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్.. నాలుగు స్టేషన్లలో హాల్ట్

ఈ దోసకాయ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరవచ్చు. ప్రస్తుతం దీని వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంత పెద్ద దోసకాయను పెంచడం అంత సులభం కాదు.. చాలా కష్టపడాల్సి వచ్చిందని విన్స్ చెప్పారు. అతను దోసకాయ బరువును తట్టుకోగలిగేలా దోసకాయ కింద బలమైన నెట్ స్వింగ్ ఉంచాడు. అతను వర్షం, ఎండ నుండి రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. తాను మేలో విత్తనాలు వేశానని, దాని నుండి ఇంత పెద్ద దోసకాయ పెరిగిందని చెప్పాడు.

Show comments