Site icon NTV Telugu

Bride Calls Off Wedding: తాళి కట్టే సమయంలో ఝలక్ ఇచ్చిన పెళ్లికూతురు.. చివరకు లవర్‌తో..!

Bride Calls Off Wedding

Bride Calls Off Wedding

Bride Calls Off Wedding:గత కొంతకాలంగా వివాహ వేడుకల్లో ఊహించని ఘటనలు జరగడం సామాన్యమైపోయింది. వధూవరులు చివరి నిమిషంలో తమ మనసులోని భావాలను బయటపెట్టి పెళ్లి మండపం పైనే సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒకవైపు కుటుంబాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంటే, మరోవైపు వధూవరుల వ్యక్తిగత నిర్ణయాలు పెళ్లి తంతును నాశనం చేస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న ఒక పెళ్లి ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే..

Read Also: S**X On Road: బరితెగించిన రాజకీయ నేత.. రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్ గా శృంగారలీలలు..!

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలోని ఆది చుంచనగిరి కళ్యాణమండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వధూవరుల పెళ్లి కోసం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేడుకలన్నీ ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మండపాన్ని అద్భుతంగా అలంకరించారు. అతిధుల కోసం విందు భోజనాలు సిద్ధం చేశారు. వధూవరులు కొత్త దంపతుల్లా మెరిసిపోతున్నారు. అన్ని అనుకున్నట్టే జరిగిపోతున్నాయి.. కానీ, కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి అచ్చం
సినిమా స్టైల్ లో ఊహించని మలుపు చోటుచేసుకుంది.

“నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను… అతనినే పెళ్లి చేసుకుంటాను. నీతో జీవించలేను. నన్ను క్షమించండి” అంటూ వధువు పెళ్లి వేదిక మీద వరుడికి షాకిచ్చింది. ఈ మాటలతో అక్కడి బంధువులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ దెబ్బతో పెళ్లికుమారుడికి ఏమి చేయాలో అర్థంకాక అలా ఉండిపోయాడు. ఇకపోతే, ఆ పెళ్ళికూతురికి గతంలో ఒక యువకుడితో ప్రేమ సంబంధం ఉండింది. కానీ, కులాంతర వివాహం కావడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. చివరికి ఆ ప్రేమను భవిష్యత్తులో మరచిపోవాలని ఆమెను వివాహానికి ఒప్పించారు. తాను ఒప్పుకోకపోతే కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించారని సమాచారం. కానీ, తాళికట్టే సమయంలో తన ప్రేమను మర్చిపోలేక నిజాన్ని బయటపెట్టి పెళ్లిని రద్దు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతుంది.

Read Also: Asaduddin Owaisi: పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం!

ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇలా చివరి నిమిషంలో చెప్పడం ఏంటని అంటున్నారు. ఏది ఏమైనా పెళ్లి చేసుకున్న తర్వాత జరిగే దారుణాలు కంటే ఆ అమ్మాయి చేసిన పని చాలా బెటర్ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో పెళ్ళికొడుకు సేఫ్ అన్నట్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సంఘటన మరోసారి ప్రేమ, వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఎలా పెరుగుతోందో, అలాగే పెళ్లిళ్లను కేవలం పెద్దల ఒత్తిడికి లోనై జరిపితే ఫలితం ఎలా ఉండొచ్చో చూపిస్తుంది.

Exit mobile version